2025కి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోను వరించింది. డెమొక్రటిక్ రైట్స్, శాంతి కోసం ఆమె చేసిన కృషిని గుర్తించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. వెనిజులాను ఆమె డిక్టేటర్‌షిప్ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించారు. అటు ఈ ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నిరాశే మిగిలింది.
1967 అక్టోబర్ 7న జన్మించిన మరియా 2002లో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీ 'వెంబె వెనెజులా'కు నేషనల్ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. 2018లో బీబీసీ 100 ఉమెన్, టైమ్ మ్యాగజైన్ వరల్డ్స్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ లిస్ట్‌లో నిలిచారు. దేశం దాటి వెళ్లకుండా ఆమెపై వెనిజులా ప్రభుత్వం నిషేధం విధించింది.