గ్రీన్‌కార్డుదారులకు అమెరికా శుభవార్త.. వ్యాలిడిటీ మరింత పెంపు

అమెరికాలో పర్మినెంట్‌గా నివాసం ఉంటున్న గ్రీన్‌కార్డుదారులు అక్కడి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By అంజి  Published on  22 Sept 2024 6:55 AM IST
USCIS,  Green Card validity, Green Card renewal, USA

గ్రీన్‌కార్డుదారులకు అమెరికా శుభవార్త.. వ్యాలిడిటీ మరింత పెంపు

అమెరికాలో పర్మినెంట్‌గా నివాసం ఉంటున్న గ్రీన్‌కార్డుదారులు అక్కడి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ శాశ్వత నివాస కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించింది. గతంలో గ్రీన్‌కార్డు గడువు తీరినప్పటికీ.. మరో రెండేళ్లు దాని వ్యాలిడిటీ పొడిగించేవారు. ఇప్పుడు దాన్ని మూడేళ్లకు పెంచినట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ తెలిపింది. దీంతో గ్రీన్‌కార్డు రెన్యువల్‌ కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త ఉపశమనం లభించింది. అమెరికాలో గ్రీన్‌ కార్డు ఉన్న వారు ప్రతి 10 సంత్సరాలకు ఒకసారి రెన్యువల్‌ చేసుకోవాలి.

కార్డు గడువు ముగిసే కాలానికి 6 నెలల ముందు ఐ-90 ఫామ్‌ను సబ్మిట్‌ చేయాలి. రెన్యువల్‌ కోసం అప్లికేషన్‌ చేసుకున్నవారికి కార్డు వ్యాలిడిటీని రెండేళ్లు పొడిగిస్తూ రిసీట్‌ నోటీసు ఇస్తారు. దీంతో గ్రీన్‌కార్డు గడువు తీరిపోయినా, ఈ నోటీసుతో వారికి చట్టబద్ధమైన నివాస హోదా కొనసాగుతుంది. కొత్త కార్డు వచ్చే వరకు వారికి అది లీగల్‌ స్టేటస్‌ ఫ్రూఫ్‌గా పని చేస్తుంది. తాజాగా ఈ గ్రీన్‌కార్డు అదనపు వ్యాలిడిటీని 36 నెలలకు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఇది కండిషనల్‌ రెసిడెన్సీ గ్రీన్‌ కార్డులు తీసుకున్న వారికి ఇది వర్తించదు.

Next Story