పుతిన్‌ ఓ నియంత.. ఆ ప్రజల హృదయాలను ఎప్పటికీ గెలవలేరు: జో బైడన్‌

US won't join Ukraine's fight, but will defend Nato territories, says Biden. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు జో బైడెన్‌ బుధవారం నాడు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రష్యా - ఉక్రెయిన్‌

By అంజి  Published on  2 March 2022 9:43 AM IST
పుతిన్‌ ఓ నియంత.. ఆ ప్రజల హృదయాలను ఎప్పటికీ గెలవలేరు: జో బైడన్‌

యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు జో బైడెన్‌ బుధవారం నాడు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంపై మాట్లాడారు. ఉక్రెయిన్‌ దేశానికి తన మద్దతు తెలిపారు. అయితే రష్యాపై ఉక్రెయిన్‌ పోరాటంలో యుఎస్ ప్రమేయం లేదని చెప్పారు. అయితే తమ దేశం తన మిత్రదేశాలతో కలిసి నాటో భూభాగాలను కాపాడుతుందని చెప్పారు. "యూఎస్, మా మిత్రదేశాలు పూర్తి శక్తితో నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటాయి. ఉక్రేనియన్లు స్వచ్ఛమైన ధైర్యంతో పోరాడుతున్నారు. పుతిన్ యుద్దభూమిలో లాభాలను ఆర్జించవచ్చు, కానీ దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. పుతిని ఓ నియంత"అని జో బైడెన్ అన్నారు.

అయితే ఉక్రెయిన్ గడ్డపై అమెరికా బలగాలు రష్యాతో సంబంధాలు పెట్టుకోబోవని ఆయన స్పష్టం చేశారు. "మా దళాలు ఉక్రెయిన్ కోసం పోరాడటం లేదు, కానీ మా నాటో మిత్రదేశాలను రక్షించడానికి, పుతిన్ పశ్చిమ దేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి పోరాడతాయన్నారు. పోలాండ్, రొమేనియా, లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియాతో సహా నాటో దేశాలను రక్షించడానికి మేము అమెరికన్ గ్రౌండ్ ఫోర్స్‌లు, ఎయిర్ స్క్వాడ్రన్‌లు, నౌకలను సమీకరించాము."అని జో బైడెన్‌ చెప్పారు.

"యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రజలు ఉక్రేనియన్లతో నిలబడతారని. నియంతలు వారి దూకుడుకు మూల్యం చెల్లించనప్పుడు, వారు యుద్ధం, గందరగోళానికి కారణమవుతారు అన్నారు. ఉక్రేనియన్లు స్వచ్ఛమైన ధైర్యంతో పోరాడుతున్నారు. కానీ రాబోయే కొద్ది రోజులు, వారాలు, నెలలు వారికి కఠినంగా ఉంటాయి. పుతిన్ కైవ్‌ను ట్యాంకులతో చుట్టుముట్టవచ్చు, కానీ అతను ఉక్రేనియన్ ప్రజల హృదయాలను ఎప్పటికీ పొందలేడు." అని జో బైడెన్‌ అన్నారు.

Next Story