అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ మహమ్మారి నుంచి బైడెన్ కోలుకున్నట్లు అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించిన మూడు రోజుల్లోనే ఆయనకు పాజిటివ్ రావడం గమనార్హం. 10 రోజుల వ్యవధిలో ఆయనకు రెండోసారి కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తమౌతోంది. దీంతో 79 ఏళ్ల బైడెన్ మరోసారి ఐసోలేషన్‌కు వెళ్లారు. కాగా ప్రస్తుతం ఆయనకు స్వల్ప లక్షాణాలే ఉన్నాయని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్ వైద్యుడు కెవిన్ ఓ కానర్ చెప్పారు.
ఈ నెల 21న బైడెన్ తొలిసారి కరోనా బారిన పడ్డారు. తీవ్రత పెద్దగా లేకపోవడంతో ఐసోలేషన్‌లో ఉంటూ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజువారీ సమీక్షల్లో పాల్గొన్నారు. అయితే వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే మహమ్మారి మళ్లీ తిరగబెట్టింది.
నిజానికి బైడెన్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్. ఏడాదిన్నర కిందటే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నారు.