అంగ‌రంగ వైభ‌వంగా వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు

US President Joe Biden hosts largest Diwali reception at White House.చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనివిధంగా శ్వేత‌సౌధంలో దీపావ‌ళి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Oct 2022 5:54 AM GMT
అంగ‌రంగ వైభ‌వంగా వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు

చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా అమెరికా అధ్య‌క్షుడి భ‌వ‌న‌మైన శ్వేత‌సౌధం(వైట్ హోస్‌)లో దీపావ‌ళి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. సోమ‌వారం జరిగిన ఈ వేడుక‌ల్లో అధ్యక్షుడు జోబిడెన్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బిడెన్‌, ఉపాధ్య‌క్షురాలు క‌మలాహ్యారిస్ ల‌తో పాటు సుమారు 200 మందికిపైగా భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా అధ్య‌క్షుడు జోబిడెన్ మాట్లాడుతూ.. "మీకు అతిథ్యం ఇవ్వ‌డం మాకు గౌర‌వంగా ఉంది. వైట్‌హౌస్‌లో ఈ స్థాయిలో నిర్వ‌హిస్తున్న తొలి దీపావ‌ళి ఇదే. అమెరికా సంస్కృతిలో దీపావ‌ళి వేడుక‌ను భాగం చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు. హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్దుల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు. గతంలో కంటే ఇప్పుడు చాలా మంది ఆసియా-ఆమెరిక‌న్లు ఉన్నారు నా కార్య‌నిర్వాహ‌క వ‌ర్గం స‌మ‌క్షంలో దీపాల‌ను వెలిగించ‌డం గౌర‌వంగా బావిస్తున్నాను". అని బైడెన్ అన్నారు.

"దీపావళి అంటే మనలో ప్రతి ఒక్కరికీ చీకటిని పారద్రోలి, ప్రపంచానికి వెలుగుని అందించే శక్తి ఉందని గుర్తుచేస్తుంది. ఈ రోజు వైట్‌హౌస్‌లో ఈ ఆనందకరమైన సందర్భాన్ని జరుపుకోవడం నాకు ఆనందంగా ఉంది" అని అధ్యక్షుడు బిడెన్ అన్నారు.

ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్ మాట్లాడుతూ.. వైట్‌హౌస్ ప్ర‌జ‌లు ఇల్లు. ఇక్క‌డ అన్ని జాతుల వారితో, అధ్య‌క్షుడు, ప్ర‌థ‌మ మ‌హిళ‌తో క‌లిసి పండుగ‌ను జ‌రుపుకోవ‌డం సంతోషంగా ఉంది. బైడెన్ కార్య‌వ‌ర్గం దీపం వెలిగించి చెడుపైమంచి, అజ్ఞానంపై విజ్ఞానం, చీక‌టిపై వెలుతురు జ‌రిగే పోరాటంలో భాగ‌మైంది అని క‌మ‌లా హ్యారిస్ అన్నారు.

Next Story