ఎంతో మంది పిల్లలు లేని వాళ్లకు వీర్యదానం అనేది చాలా ముఖ్యమైనది. 180 మంది పిల్లలకు తండ్రి అయిన UKలోని న్యూకాజిల్‌కు చెందిన ఒక స్పెర్మ్ డోనర్ తన ప్రయాణంలో ఎన్నో కోల్పోవలసి వచ్చిందని తెలిపారు. మహిళలు గర్భం దాల్చడానికి తాను చాలా త్యాగాలు చేశానని వెల్లడించాడు. స్పెర్మ్ డోనర్‌గా ఉండడం వల్ల ఒంటరితనం ఎదుర్కోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. 52 ఏళ్ల వ్యక్తి గత 13 సంవత్సరాలుగా స్పెర్మ్‌ను దానం చేస్తున్నాడు. సహజ గర్భధారణ, పాక్షిక గర్భధారణ, కృత్రిమ గర్భధారణ వంటి వివిధ పద్ధతులకు అతడు ఇచ్చిన స్పెర్మ్ ను వాడుతున్నారు వైద్యులు.
అతని ప్రయాణం సాగుతున్నప్పుడు.. అతడి మీద ఎంతో మంది అనేక రకాలుగా వ్యాఖ్యలు చేసారు. చాలా మంది అతను సెక్స్ కోసమే స్పెర్మ్ డోనార్ గా ఉన్నాడని భావించారు. స్పెర్మ్ డోనర్‌గా అతని అంకితభావం కారణంగా అతడు జీవితంలో ఒంటరిగా ఉన్నాడు. వ్యక్తిగతంగా లవ్ లైఫ్ ను కోల్పోవాల్సి వచ్చింది. నిస్వార్థ మార్గంలో ఇతరులకు సహాయం చేయడానికి నేను నా లవ్ లైఫ్ ను వదులుకున్నాను.. ముద్దు, కౌగిలింతకు కూడా దూరంగా ఉన్నానని తెలిపాడు.