కరోనా వైరస్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. సెకండ్ వేవ్ నుంచి భారత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే థర్ఢ్ వేవ్ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. బ్రిటన్‌లో ప్రస్తుతం థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని భారత సంతతి శాస్త్రవేత్త, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రవి గుప్తా హెచ్చరించారు. రోజువారి కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికి త్వరలోనే పరిస్థితి తీవ్రమవుతుందన్నారు.
ఇంగ్లాండ్‌లో బయటపడుతున్న కొత్త కేసుల్లో నాలుగింట మూడొంతులు.. భారత్‌లో తొలిసారిగా బయటపడ్డ బి.1.617 రకానివేనని చెప్పారు. మున్ముందు ఇది మరితం వేగంగా విజృంభించే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 21 నుంచి బ్రిటన్‌లో అన్నిరకాల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాకాలు చేస్తోంది. దీంతో ఈ ఆలోచనను పక్కకు పెట్టాలని ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ప్రొఫెసర్ రవిగుప్తా కోరారు.