కంపెనీ అవాక్క‌య్యేలా రెజ్యూమ్‌.. టాప్ కంపెనీలో జాబ్‌

UK man put flyers with LinkedIn profile on cars.క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది త‌మ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2022 2:57 AM GMT
కంపెనీ అవాక్క‌య్యేలా రెజ్యూమ్‌.. టాప్ కంపెనీలో జాబ్‌

క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది త‌మ ఉద్యోగాలు కోల్పోయారు. ఇక ఉద్యోగాల కోసం రెజ్యూమ్ చేత ప‌ట్టుకుని తిరుగుతున్న‌వారు ఎంతోమంది. అంద‌రిలా రెజ్యుమ్ త‌యారు చేసుకుని ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తే సంస్థ యాజ‌మాన్యాలు ప‌ట్టించుకోవ‌ని కొంద‌రు త‌మ సృజ‌న‌కు ప‌దును పెడుతుంటారు. బ్రిట‌న్ చెందిన ఓ నిరుద్యోగి ఇలాగే త‌న‌ తెలివితేట‌కు కాస్త ప‌దును పెట్టి కంపెనీ యాజ‌మాన్యం అవాక్క‌య్యేలా రెజ్యూమ్‌ను రూపొందించాడు. ఇంకేముంది.. అత‌డు చేసిన ప‌నికి మెచ్చుకున్న స‌ద‌రు కంపెనీ యాజ‌మాన్యం వెంట‌నే అత‌డికి ఉద్యోగాన్ని ఇచ్చింది.

వివ‌రాల్లోకి వెళితే.. బ్రిట‌న్‌కు చెందిన జొనాథ‌న్ స్విఫ్ట్ అనే వ్య‌క్తి నిరుద్యోగి. చాలా రోజులుగా ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ క్ర‌మంలో యార్క్‌షైర్‌లో ఉన్న ఇన్‌స్టాంట్‌ప్రింట్ అనే కంపెనీలో ఉద్యోగులు కావ‌లెను అనే ప్ర‌క‌ట‌న చూశాడు. అంద‌రిలా రెజ్యూమ్ ఇస్తే.. త‌న‌కు జాబ్ వ‌స్తుంద‌న్న గ్యారెంటీ ఉండ‌ద‌ని కాస్త వెరైటీగా ఆలోచించాడు. ఆ కంపెనీ కర‌ప‌త్రాల‌ను కొన్ని సేక‌రించి.. త‌న లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ను వాటిపై ముద్రించాడు. దానిపై బార్‌కోడ్‌ను ఏర్పాటు చేశాడు.

వాటిని తీసుకువెళ్లి.. ఆ కంపెనీ పార్కింగ్ స్థ‌లంలో నిలిచి ఉన్న కార్ల‌కు అంటించ‌డం మొద‌లుపెట్టాడు. అత‌డి మార్కెటింగ్ స్కిల్స్ న‌చ్చిన ఆ సంస్థ జొనాథ‌న్‌ను ఇంట‌ర్వ్యూకి పిలిపించింది. వెంట‌నే అత‌డికి ఉద్యోగం ఇచ్చింది. దీనిపై ఆ కంపెనీ మార్కెటింగ్ మేనేజ‌ర్ క్రెయిగ్ వాస్కెల్ మాట్లాడుతూ.. తాము ఉద్యోగ ప్ర‌క‌ట‌న ఇచ్చింది ఇలాంటి సృజ‌నాత్మ‌క ఆలోచ‌న ఉన్న వారి కోస‌మేన‌ని. అందుక‌నే అత‌డికి ఇంకేమి ఆలోచించ‌కుండా ఉద్యోగం ఇచ్చామ‌న్నారు. కాగా.. జొనాథ‌న్ కార్ల‌కు త‌న రెజ్యూమ్‌ను అంటిస్తున్న వీడియోను ఆ కంపెనీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది.

Next Story