నిశ్శబద్దంగా ఉండండి.. మమ్మీ నిద్రపోతోంది.. హృదయవిదారకం..!

Two girls spend days deceased mother France.ఫ్రాన్స్‌ దేశంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన తల్లి

By అంజి  Published on  3 Oct 2021 4:49 AM GMT
నిశ్శబద్దంగా ఉండండి.. మమ్మీ నిద్రపోతోంది.. హృదయవిదారకం..!

ఫ్రాన్స్‌ దేశంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన తల్లి వద్ద నిద్రపోతుందనుకొని రోజుల కొద్దీ గడిపారు ఇద్దరు చిన్నారులు. వివరాల్లోకి వెళ్తే.. లేమాన్స్ పట్టణంలోన ఓ మహిళ తన ఐదేళ్ల కూతురు, ఏడేళ్ల కూతురితో కలిసి ఓ ఇంట్లో నివాసం ఉంటోంది. కొన్ని రోజుల కిందట ఆమె సడన్‌గా మృతి చెందారు. అయితే విషయం తెలియని చిన్నారులు తమ తల్లి నిద్రపోతుందనుకొని రోజుల కొద్ది ఆమె దగ్గరే గడిపారు. కొద్ది రోజులుగా చిన్నారులు పాఠశాలకు రాకపోవడంతో స్కూల్‌ యాజమాన్యం తల్లిని సంప్రందించేందుకు ప్రయత్నించారు. ఆమె నుంచి స్పందన రాకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చిన్నారుల ఇంటికి వెళ్లారు.

పోలీసులు డోర్‌ కొట్టి చూడగా.. చిన్నారులు తమ తల్లి నిద్రపోతుందని నిశ్శబ్దంగా ఉండాలని అన్నారు. అయితే చిన్నారుల తల్లి నుండి దుర్వాసన రావడంతో.. మృతి చెందినట్టుగా పోలీసులు నిర్దారించారు. అనంతం మృతదేహాన్ని పోస్టుమార్టం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులిద్దరికి వైద్యులు కౌన్సెలింగ్‌ అందిస్తున్నారు. సదరు చిన్నారుల తల్లి సహజంగానే మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు.. ఎన్ని రోజుల క్రితం మృతి చెందిన విషయంపై మాత్రం స్పష్టం చేయలేదు.

Next Story