నైట్‌ క్లబ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి

Two dead in Norway nightclub shooting.ఓ నైట్ క్ల‌బ్‌లో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2022 3:25 AM GMT
నైట్‌ క్లబ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి

ఓ నైట్ క్ల‌బ్‌లో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి చెందగా.. మ‌రో 14 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న నార్వే దేశ రాజ‌ధాని ఓస్లోలో శ‌నివారం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. ఓ స్లో న‌గ‌రం మ‌ధ్య‌లో ఉన్న ప్ర‌ముఖ లండ‌న్ ప‌బ్‌((గే బార్‌, నైట్‌ క్లబ్‌)లో శ‌నివారం ఓ దుండ‌గుడు బ్యాగుతో ప్ర‌వేశించాడు. త‌న బ్యాగులోంచి తుపాకీ బ‌య‌ట‌కు తీసి కాల్పులు జ‌రప‌డం ప్రారంభించాడు. దీంతో క్ల‌బ్‌లో ఉన్న వారంతా భ‌యంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు అని ఓ ప్ర‌త్య‌క్ష సాక్షి తెలిపిన‌ట్లు స్థానిక మీడియా వెల్ల‌డించింది.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు అనుమానిస్తున్న‌నిందితుడిని క్ల‌బ్‌కు స‌మీపంలో ప‌ట్టుకున్నారు. కాగా.. క్ల‌బ్ లోప‌ల‌, స‌మీపంలో కాల్పులు జ‌ర‌ప‌డంతో ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌ర‌ణించగా, 14 మంది గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. వారిలో ముగ్గురు ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలిపారు. అయితే.. కాల్పుల‌కు గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేద‌ని, దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు.

Next Story