యూకేలో బయటపడిన మ‌రో కొత్త వ్యాధి.. మంకీపాక్స్

Two cases of monkey pox virus found in Wales.క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికించింది. ఇంకా ఈ మ‌హ‌మ్మారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2021 2:51 AM GMT
యూకేలో బయటపడిన మ‌రో కొత్త వ్యాధి.. మంకీపాక్స్

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికించింది. ఇంకా ఈ మ‌హ‌మ్మారి నుంచి పూర్తిగా బ‌య‌ట ప‌డ‌నే లేదు. అప్పుడే మ‌రో ముప్పు పొంచి ఉంద‌ని అంటున్నారు నిపుణులు. అదే మంకీపాక్స్‌. దీని వ‌ల్ల ఇప్ప‌టికిప్పుడే ప్ర‌మాదం లేక‌పోయినా.. జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే భ‌విష్య‌త్‌లో ఇది విరుచుకుప‌డే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. యూకేలోని నార్త్‌వేల్స్‌లో రెండు మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్య్లూహెచ్ఓ) చెప్పింది. వీరిద్ద‌రు ఒకే కుటుంబానికి చెందిన వార‌ని తెలిపింది. వీరికి ఈ వ్యాధి సోకి 21 రోజులు అయ్యింద‌ని, ఈ 21 రోజుల్లో వీరు ఎవ‌రెవ‌రిని క‌లిసార‌నే దానిని తెలుసుకునే ప‌నిలో ప‌డ్డారు అక్క‌డి అధికారులు. కాగా.. వీరు యూకే దాటి వెళ్ల‌లేద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు ఇంగ్లాండ్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

మంకీపాక్స్ అంటే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. మంకీపాక్స్ జూనోటిక్ వైరల్ వ్యాధి. మధ్య ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికాలోని అడవుల్లో ఉండే ప్రజలకు ఎక్కువ‌గా సోకుతూ ఉంటుంది. ఈ వైరస్ సోకిన జంతువు యొక్క రక్తం, చెమట లేదా లాలాజలం ద్వారా మంకీపాక్స్ వైరస్ మానవులకు వ్యాపిస్తుంది. కరోనా లాగే మంకీపాక్స్ కూడా ఇతరులకు ఈజీగా సోకగలదు. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా.. తుంపర్ల ద్వారా ఇతరులకు ఇది సోకుతుంది.

మంకీపాక్స్‌ లక్షణాలు..

మంకీపాక్స్ యొక్క లక్షణాలు మశూచి మాదిరిగానే ఉంటాయి. లక్షణాలు స్వల్పంగా లేదా తీవ్రంగా ఉండగలవు. చర్మంపై కురుపులు వస్తాయి. అవి బాగా దురద పెడతాయి. నొప్పి కూడా ఉంటుంది. స్వల్ప లక్షణాలు ఉంటే గుర్తించ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. ఫలితంగా ఒకరి నుంచి ఒకరికి ఈజీగా సోకేస్తుంది.

యూకే ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం.. సంక్రమణ తర్వాత 1 నుండి 5 రోజుల తరువాత చర్మ దద్దుర్లు కనిపిస్తాయి. ఇది దాని ప్రారంభ లక్షణం. ఈ దద్దుర్లు ముఖం నుండి మొదలవుతాయి, క్రమంగా అవి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఈ దద్దుర్లు క్రమంగా బొబ్బలుగా మారి వాటిలో ద్రవ నిండి ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడిన వారిలో మరణించే ప్రమాదం 11 శాతం వరకు ఉంది. మశూచి నుండి రక్షించడానికి టీకా రోగనిరోధక గ్లోబులిన్ ఉపయోగిస్తారు.

Next Story