ఖాట్మండు నుండి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. కోల్‌కతా విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండింగ్ తర్వాత 236 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. వార్తా సంస్థ ANI నుండి వచ్చిన ప్రాథమిక నివేదికల ప్రకారం.. సిబ్బంది విమానాన్ని తనిఖీ చేస్తున్నారు.
ఖాట్మండు నుండి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కిష్ విమానం నంబర్ 727 అత్యవసరంగా ల్యాండింగ్ అయిందని కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ (ఎన్‌ఎస్‌సిబిఐ) విమానాశ్రయం విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగవచ్చని విమానం కెప్టెన్ కోల్‌కతా ATCకి సమాచారం అందించాడు. మధ్యాహ్నం 2:49 గంటల ప్రాంతంలో విమానం కోల్‌కతా విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.