'మోజ్తాబా ఖమేనీ స్వలింగ సంపర్కుడేమో'.. అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌పై ట్రంప్‌ ఆశ్చర్యం

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అమెరికా నిఘా సంస్థలు ఒక ఆశ్చర్యకరమైన నివేదికను అధ్యక్షుడు...

By -  అంజి
Published on : 17 March 2026 7:31 AM IST

Mojtaba Khamenei Gay Rumors, Trump Intelligence Briefing, Iran Supreme Leader, US-Iran Conflict 2026, New York Post Report, Classified Briefing, Ayatollah Ali Khamenei Successor

'మోజ్తాబా ఖమేనీ స్వలింగ సంపర్కుడేమో'.. అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌పై ట్రంప్‌ ఆశ్చర్యం

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అమెరికా నిఘా సంస్థలు ఒక ఆశ్చర్యకరమైన నివేదికను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సమర్పించాయి. మొజ్తబా ఖమేనీ 'గే' (స్వలింగ సంపర్కుడు) అయి ఉండవచ్చని, ఈ సమాచారం విశ్వసనీయమైనదేనని నిఘా వర్గాలు భావిస్తున్నట్లు 'న్యూయార్క్ పోస్ట్' తన కథనంలో పేర్కొంది. గత వారం జరిగిన ఒక రహస్య భేటీలో ఈ వివరాలను వెల్లడించగా, అధ్యక్షుడు ట్రంప్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారని, ఆపై నవ్వేశారని సమాచారం.

నిఘా నివేదికలోని ముఖ్యాంశాలు:

అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. మొజ్తబా ఖమేనీకి తన చిన్ననాటి ట్యూటర్‌తో దీర్ఘకాలికంగా శారీరక సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణించినప్పుడు, మొజ్తబా కూడా గాయపడ్డారు. ఆ సమయంలో చికిత్స పొందుతూ తనను చూసుకుంటున్న పురుష నర్సులు లేదా సంరక్షకుల పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తించారని నివేదికలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి ఫోటోలు లేదా వీడియో ఆధారాలు లేనప్పటికీ, అత్యున్నత స్థాయి వర్గాల నుంచి అందిన ఈ సమాచారం నూటికి నూరు శాతం నిజమని నిఘా అధికారులు ధృవీకరిస్తున్నారు.

తండ్రికి ముందే తెలుసా?

మొజ్తబా ఖమేనీ వ్యక్తిగత ప్రవర్తనపై ఆయన తండ్రి అలీ ఖమేనీకి కూడా అనుమానాలు ఉండేవని, అందుకే తన తర్వాత మొజ్తబా వారసుడు కావడం ఆయనకు ఇష్టం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. 2008లో వికిలీక్స్ బయటపెట్టిన ఒక రహస్య సమాచారం ప్రకారం.. మొజ్తబా నపుంసకత్వ సమస్యతో బాధపడ్డారని, చికిత్స కోసం పలుమార్లు లండన్‌కు వెళ్లారని వెల్లడైంది. ఇరాన్ వంటి కఠిన ఇస్లామిక్ దేశంలో స్వలింగ సంపర్కం నేరం మాత్రమే కాదు, దానికి మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత నాయకుడిపైనే ఇలాంటి ఆరోపణలు రావడం ఇరాన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో, ఈ వ్యక్తిగత ఆరోపణలు ఇరాన్ అంతర్గత రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

Next Story