అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని, ఇరు దేశాల మధ్య త్వరలోనే ఒక భారీ ట్రేడ్ డీల్ కుదరబోతుందని అన్నారు. ఈ ప్రపంచ ఆర్థిక సదస్సులో తన ప్రసంగం ముగిసిన తర్వాత భారత్‌కు చెందిన మీడియా సంస్థతో ట్రంప్ మాట్లాడారు. భారత ప్రధానమంత్రిపై తనకు అపారమైన గౌరవం ఉందని, ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. తనకు మంచి మిత్రుడని చెప్పారు. అంతేకాకుండా త్వరలోనే భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటించారు.