ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వింత రాళ్లు ఉన్నాయి. వాటిలో కొన్ని వింత ఆకారంలో ఉంటే, మరికొన్ని వెరైటీ సౌండ్స్ చేస్తుంటాయి. ఇంకొన్ని సైజ్ పెరుగుతూ ఉంటాయి. ఇలానే ఫ్రాన్స్‌లోని హుయెల్‌గోట్ ఫారెస్ట్‌లో ఓ వింత 'ట్రెంబ్లింగ్ రాయి' ఉంది. 137 టన్నుల బరువు ఉండే ఈ రాయిని పిల్లలు కూడా సింపుల్‌గా జరపొచ్చట. ఇంత పెద్ద రాయి.. ఇంత సింపుల్‌గా ఎలా జరుగుతోందని ఆశ్చర్యపోతున్నారా.. అసలు నిజం ఇదే.
రాయి కదలడం వెనక మర్మమేంటి?
హుయెల్‌గోట్ ఫారెస్ట్‌లో ఇలాంటి రాళ్లు చాలా ఉన్నా.. దీనికి మాత్రమే ఓ స్పెషాలిటీ ఉంది. ఈ రాయి కింది భాగం మొత్తం సమానంగా లేదు. కొన్ని అంచులపై ఆధారపడి ఈ రాయి నిలబడింది. సో రాయి నిలబడని అంచుకు అపోజిట్ వెళ్లి కదిపితే రాయి కదులుతుంది. రాయి ఉండే కోణం, ప్రదేశం కారణంగానే ఇది సాధ్యమవుతోంది. ఈ రాయి 7 మీటర్ల పొడవు ఉంటుంది.
పర్యాటకుల తాకిడి ఎక్కువే
అడవి నుంచి బయటకు తీసుకొస్తే స్పెషాలిటీ పోతుందని ఈ బండరాయిని అక్కడే ఉంచారు. అప్పటి నుంచి రోజూ ఈ రాయిని చూడ్డానికి ఎంతోమంది టూరిస్ట్‌లు వస్తున్నారు. ఇక్కడి వచ్చే టూరిస్ట్‌లు దాదాపు 20 ఆఫ్రికా ఎనుగులంతా బరువు ఉండే ఈ రాయిని కదిపేందుకు ప్రయత్నిస్తారు. కొందరు సక్సెస్ అయితే మరికొందరు విఫలమవుతారు.