ఆ గ్రామానికి వద్దన్నా వస్తున్న పర్యాటకులు

Tourists are coming even if they say not to come to Hallstatt village. అదో స్వచ్ఛమైన గల గల పారే నది.. ఆ నది ఒడ్డు వెంబడి ఓ కుగ్రామం. ఇళ్లన్నీ ఒడ్డు పక్కనే ఉంటాయి. ఆ గ్రామానికి ఇన్‌స్టాగ్రామ్ విలేజ్

By అంజి  Published on  14 Aug 2022 10:36 AM GMT
ఆ గ్రామానికి వద్దన్నా వస్తున్న పర్యాటకులు

అదో స్వచ్ఛమైన గల గల పారే నది.. ఆ నది ఒడ్డు వెంబడి ఓ కుగ్రామం. ఇళ్లన్నీ ఒడ్డు పక్కనే ఉంటాయి. ఆ గ్రామానికి ఇన్‌స్టాగ్రామ్ విలేజ్ అని పేరు కూడా ఉంది. నిత్యం వేలాది మంది పర్యాటకులు ఆ గ్రామానికి క్యూ కడుతుంటారు. అయితే అదే ఆ ఊరి వారికి పెద్ద సమస్యగా మారింది.

ఆస్ట్రియా దేశంలోని అత్యంత అందమైన గ్రామం 'హాల్‌స్టాట్'. నది పక్కనే ఈ గ్రామం ఉండటంతో పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఇన్‌స్టా పోస్టుల కోసం, ఈ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇన్‌స్టా రీల్స్, ఫొటోలు తీసుకోవడం కోసం ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడి వస్తారు. ఇక ఆ ఫొటోలకు లైకులు, షేర్లు కూడా బాగానే వస్తాయి. అందుకే ఈ గ్రామం ఇన్‌స్టాగ్రామ్ విలేజ్‌గా పేరు తెచ్చుకుంది. చాలా మంది టూరిస్ట్‌ల ఇన్‌స్టా ఖాతాల్లో ఈ గ్రామం కనిపిస్తుంది.

చిన్న గ్రామం కావడంతో నిత్యం కొత్త మనుషులు తిరగడం స్థానికుల్లో అసౌకర్యాన్ని, భయాన్ని పెంచుతోంది. దీంతో ఆ గ్రామ పెద్దలు అక్కడికి వచ్చే టూరిస్ట్‌ల కోసం నియమ నిబంధనలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అలాగే స్థానిక ప్రభుత్వం కూడా ఈ గ్రామాన్ని టూరిస్ట్‌ల బారి నుంచి కాపాడాలని నిర్ణయించింది. హాల్‌స్టాట్ గ్రామంలో 800 మంది జనాభా ఉంటారు. ఈ గ్రామానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌ గుర్తింపు కూడా ఉంది. ఈ గ్రామం చాలా అందంగా ఉంటుంది. 2018లో ఈ గ్రామాన్ని ఒక మిలియన్ మంది టూరిస్ట్‌లు సందర్శించారు.

Next Story