చెట్లు చిరు గాలి వీస్తే ఎంతో హాయిగా ఉంటుంది. అదే చెట్లు బలంగా గాలి వీస్తే భయం గొల్పిస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే చెట్లు సంతోషం వస్తే మనిషి కుప్పి గంతులు వేసినట్లు డ్యాన్స్ చేస్తాయి. అది కూడా అలాంటి ఇలాంటి డ్యాన్స్ కాదు.. ఏకంగా సాల్సా డ్యాన్స్ చేస్తాయి. ఇండోనేషియాలోని సుంబా ఐలాండ్‌లో 'డ్యాన్సింగ్ ట్రీస్' ఉన్నాయి.
ప్రముఖ టూరిస్ట్ ప్లేస్‌లలో ఒకటైన వాలకిరి బీచ్‌లోని తెల్లని ఇసుక మధ్యలో ఉండే ఈ 'డ్యాన్సింగ్ ట్రీస్' అచ్చం డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తాయి. నిజానికి ఈ చెట్లు నిశ్చలంగానే ఉంటాయి. పొట్టిగా రెండు లేదా మూడు కొమ్మలు, చిన్న చిన్న ఆకులతో కనిపించే వీటి విభిన్న ఆకృతి, డ్యాన్స్ చేస్తుంటే మధ్యలో ఆగిన పోసర్‌లో భ్రమింపజేస్తుంది. సముద్ర తీరంలో ఉండే ఈ చెట్లు అలల తాకిడికి ఓ చోటు నుంచి మరో చోటుకు కదులుతుంటాయి. వీటి కారణంగానే ఈ చెట్లు ఇసుక తిన్నెల మీద డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తాయి.
ఇక ఈ డ్యాన్సింగ్ చెట్లను చూసేందుకు పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారు. ఈ చెట్లు సాల్సా డ్యాన్స్ చేస్తుంటే చూపరులు కనులు తిప్పుకోలేరు. సన్‌రైస్, సన్‌సెట్ సమయంలో ఈ చెట్లు డ్యాన్స్ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుందని పర్యాటకులు చెబుతున్నారు. మీరు కూడా ఈ 'డ్యాన్సింగ్ ట్రీస్'ని చూడాలనుకుంటున్నారా.. అయితే వెంటనే ఇండోనేషియా బయల్దేరండి.