ఇరాన్‌లో గత 48 గంటలకు పైగా తీవ్రమైన ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడిందని సైబర్ సెక్యూరిటీ వాచ్‌డాగ్ సంస్థ 'నెట్‌బ్లాక్స్' నివేదించింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగిన జనవరి నెలలో కొన్ని వారాల పాటు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. గతంలో ఎప్పుడు అల్లర్లు, ఆందోళనలు చెలరేగినా ఇరాన్ అధికారులు ఇలా ఇంటర్నెట్ సేవల నిలిపివేత పైనే ఆధారపడేవారు. అయితే నెట్‌వర్క్ కనెక్టివిటీ పూర్తిగా కట్ కాలేదని.. కొంత ఆన్‌లైన్ యాక్సెస్ ఇంకా పనిచేస్తూనే ఉందని అక్కడి స్థానిక జర్నలిస్టులు చెబుతున్నారు.
ఇరాన్ రాష్ట్ర మీడియా, ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రకారం అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులు ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ అంతటా కనీసం 555 మంది మరణించారని నివేదించింది.