టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు అరెస్ట్.. ఎందుకంటే..
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 2:21 AM GMTటెలిగ్రామ్ వ్యవస్థాపకుడు అరెస్ట్.. ఎందుకంటే..
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఫ్రాన్స్‌లో శనివారం రాత్రి పావెల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారిస్‌లోని బోర్గెట్ ఎయిర్‌పోర్టులో పోలీసులకు పావెల్ పట్టుబడినట్లు అధికారులు చెప్పారు. అయితే.. అజర్‌బైజాన్‌లోని బాబు నుంచి ఎయిర్‌పోర్టులో తన ప్రైవేట్ జెట్‌లో దిగాడు. ఒక కేసు విషయంలో కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన రాలేదని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పావెల్ దురోవ్ అరెస్ట్‌పై టెలిగ్రామ్ ఇప్పటికైతే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలదు. ఫ్రెంచ్ పోలీసులు మాత్రం అతన్ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ క్రమంలోనే రష్యా బ్లాగ్లర్లు మండిపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరల్డ్ వైడ్‌గా ఉన్న ఫ్రెంచ్ రాయబార కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపనున్నట్లు చెప్పారు.
టెలిగ్రామ్ యాప్‌కు సంబంధించిన కేసులో పావెల్‌ను ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది. వాస్తవానికి టెలిగ్రామ్‌లో మోడరేటర్లు లేకపోవడంపై ఫ్రెంచ్ పోలీసులు దర్యాప్తు చేశారు. మోడరేటర్‌లు లేకపోవడం వల్ల మెసేజింగ్ యాప్‌లో నేర కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. దీని కారణంగా యాప్ ద్వారా నేర కార్యకలాపాలు పెరుగుతున్నట్లు ఫ్రెంచ్ ఏజెన్సీ OFMIN తెలిపింది. మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు దురోవ్‌పై ఈ ఏజెన్సీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.నేరపూరిత వినియోగాన్ని అరికట్టడంలో దురోవ్ తన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ విఫలమైందని ఏజెన్సీ పేర్కొంది. అందుకే అతడిని అరెస్టు చేసినట్లు అక్కడి మీడియా చెబుతోంది.