సోమ్‌నాథ్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశాం.. అక్కడ కొత్తగా..

Taliban smash Somnath idol.ఆప్ఘాన్‌లో తాలిబన్ల అరాచక పాలన సాగుతోంది. తాలిబన్ల ఆగడాలు రోజు రోజుకు

By అంజి  Published on  7 Oct 2021 6:03 AM GMT
సోమ్‌నాథ్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశాం.. అక్కడ కొత్తగా..

ఆప్ఘాన్‌లో తాలిబన్ల అరాచక పాలన సాగుతోంది. తాలిబన్ల ఆగడాలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి. మొన్నటి వరకు మేం గతంలోలాగా కాదు మారాం అన్న తాలిబన్లు... ఇప్పుడు వారి అసలు వైఖరిని బయటపెడుతున్నారు. అందుకు సజీవ సాక్ష్యం ఆప్ఘానిస్తాన్‌లో ఉన్న సోమనాథ్‌ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేయడమే. ఆప్ఘాన్‌లోని ప్రముఖ సోమ్‌నాథ్‌ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తాలిబన్లకు అనస్ హక్కానీ ట్వీటర్ వేదికగా తెలిపాడు. దాని స్థానంలో సుల్తాన్‌ మహ్మద్ ఘజ్నవీ దర్గాను నిర్మిస్తామని ప్రకటించాడు. ఇవాళ మేం 10వ శతాబ్దపు ముస్లిం యోధుడు మహ్మద్ ఘజ్నవీ దర్గాకు వెళ్లామని.. ఈ ప్రాంతంలో బలమైప ముస్లిం రాజ్యాన్ని ఆయన స్థాపించారు.. అక్కడే ఉన్న సోమ్‌నాథ్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశామని ట్వీటర్‌ పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా భారత్‌పై దండయాత్ర ప్రకటించి గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు మహ్మద్‌ గజ్నవిని తాలిబన్‌ నాయకుడు అనాస్‌ హక్కానీ పొగిడాడు. అంతేకాకుండా అతని పాలన తాలిబన్లలో అహంకారం, ధైర్యాన్ని పెంచిందని పేర్కొన్నాడు. భారత్‌లోని సోమ్‌నాథ్‌ దేవాలయం 1951లో పునర్మించారు. అప్పటి కేంద్ర హోంశాఖమంత్రి వల్లభాయ్‌ పటేల్ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం శ్రీ సోమ్‌నాథ్‌ మందిర్‌ ట్రస్ట్‌కు ప్రధాని మోడీ చైర్మన్‌గా ఉన్నారు.

Next Story