భూమి మీదకు సునీతా, విల్మోర్ తిరుగుపయనం.. రేపు తెల్లవారుజామే ల్యాండింగ్
నాసా వ్యోమగాములు సునీతా విలియ్స్, బుచ్ విల్మోర్‌లు దాదాపు 9 నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు వస్తున్నారు.
By అంజి
భూమి మీదకు సునీతా, విల్మోర్ తిరుగుపయనం.. రేపు తెల్లవారుజామున ల్యాండింగ్
నాసా వ్యోమగాములు సునీతా విలియ్స్, బుచ్ విల్మోర్‌లు దాదాపు 9 నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు వస్తున్నారు. దీంతో ఐఎస్‌ఎస్‌లోని మిగతా వ్యోమగాములు వీరికి ఘనంగా వీడ్కోలు పలికారు. వారితో ఫొటోలు దిగుతూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇక భూమి మీదకు వెళ్తామో లేదో అనుకున్న వ్యోమగాములు స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ద్వారా ఇంటికి చేరుతున్నారు. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సుల్ నిర్దేశిత మార్గంలో భూమివైపు వస్తోంది.
స్పేస్ ఎక్స్ క్రూ క్యాప్సుల్‌లో రేపు తెల్లవారుజామున భూమిపైకి రానున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌పై అందరి దృష్టి నెలకొంది. క్యాప్సుల్ తెరుచుకున్న వెంటనే వీరిని స్ట్రెచర్స్‌లో బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. స్పేస్ నుంచి ఒక్కసారిగా భూమిపైకి రావడం, అంతరిక్షంలో నెలల పాటు ఉండటంతో వీరి శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం కారణమని నిపుణులు చెబుతున్నారు. వీరు నడవలేని స్థితిలో ఉంటారని అంటున్నారు.
గత ఏడాది జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్మోర్ దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉన్నారు. 8 రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా వీళ్లను తీసుకెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్‌లో సమస్యలు తలెత్తాయి. ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు, థ్రస్టర్స్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోయింది. దీంతో సెప్టెంబర్ 7న వ్యోమగాములు లేకుండానే స్టార్ లైనర్ భూమికి తిరిగి రాగా వారు అక్కడే ఉండిపోయారు.