Summer vacation: కోకాకోలాలో స్విమ్మింగ్ చేయాలంటే ఈ దేశానికి వెల్లాల్సిందే!

కోకాకోలా సరస్సు బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో నార్టే దక్షిన తీరంలో ఉంది. ఈ సరస్సు అసలు పేరు లగోవా ద అరారాక్వారా.

By అంజి  Published on  31 March 2023 11:34 AM GMT
Summer vacation, Coca Cola Lake , Brazil , Tourist Hotspot

Summer vacation: కోకాకోలాలో స్విమ్మింగ్ చేయాలంటే ఈ దేశానికి వెల్లాల్సిందే! 

కోకాకోలాను ఇష్టపడని వారంటూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తాగుతుంటారు. వేసవిలో ఇంకా ఎక్కువగా తాగుతారు. అయితే కోకాకోలాలో ఎప్పుడైనా స్విమ్మింగ్ చేయాలనిపించిందా?.. అయితే నిజంగానే చేయొచ్చు. ఓ దేశంలో కోకాకోలా సరస్సు ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ కోకాకోలా సరస్సు బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో నార్టే దక్షిన తీరంలో ఉంది. ఈ సరస్సు అసలు పేరు లగోవా ద అరారాక్వారా. అయితే అందులోని నీరు అచ్చం కోకాకోలా రంగులో ఉండడంతో కోకాకోలా సరస్సు అని పేరు వచ్చింది. ఈ నీరును తాగి చూస్తే ఉప్పగా ఉంటుందట. ప్రపంచ దేశాల నుంచి చాలా మంది టూరిస్టులు ఈ సరస్సును చూడడానికి వెళ్తుంటారు. ముఖ్యంగా సమ్మర్‌లో ఎక్కువగా వెళ్తుంటారు. సరస్సులోకి దిగి స్విమ్మింగ్ కూడా చేస్తుంటారు. పర్యాటకుల తాకిడి రోజురోజుకు పెరుగుతుండడంతో అక్కడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారట. సమ్మర్‌లో స్పెషల్ ప్రోగ్రామ్స్‌ను కూడా నిర్వహిస్తారట.

ఈ సరస్సులోని నీటిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు నీరు కోకాకోలా రంగులోకి మారడానికి గల కారణాలు కొనుగొన్నారు. ఐరన్, అయొడిన్‌తో పాటు మరికొన్ని రసాయనాల కారణంగా నీరు ఆ రంగులోకి మారాయని గుర్తించారు. అంతేకాకుండా ఆ నీటిలో దిగడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలుగదని వెల్లడించారు.

Next Story