స్పేస్ ఎక్స్ రాకెట్ పేలిపోయింది

SpaceX’s Starship Prototype Crashes in Firebal. ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ సంస్థ మిష‌న్ మార్స్

By Medi Samrat  Published on  11 Dec 2020 10:02 AM GMT
స్పేస్ ఎక్స్ రాకెట్ పేలిపోయింది

ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' సంస్థ మిష‌న్ మార్స్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. దానిలో భాగంగా డిసెంబర్ 9న స్పేస్ ఎక్స్ హెవీ లిఫ్ట్ రాకెట్ స్టార్ షిప్‌ను టెస్ట్ లాంచ్ చేసింది. కానీ ఆ అంతరిక్ష నౌక ల్యాండ్ అవుతున్న సమయంలో పేలిపోయింది.

మనుషులను అంతరిక్షంలోకి పంపే విషయంలో అమెరికాకు చెందిన బిలియనీర్ ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల తాను రూపొందించిన రాకెట్ లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది కూడా. ఈ నేపథ్యంలో మార్స్ మిషన్ ప్రయత్నాలు ప్రారంభించిన ఆ సంస్థ.. 16 అంతస్థుల పొడవుండే హెవీ లిఫ్ట్ రాకెట్ స్టార్ షిప్ ను తాజాగా ప్రయోగించింది. టెస్ట్ లాంచ్ ప్రారంభమైన తర్వాత స్టార్ షిప్ కక్ష్య లోకి వెళ్లింది. నింగిలోకి వెళ్లిన తర్వాత ఒకదాని వెనుక మరొకటి మూడు ఇంజిన్లు పని చేశాయి. అయితే, 4 నిమిషాల 45 సెకన్ల తర్వాత మూడో ఇంజిన్ ఆరిపోయింది. అక్కడ నుంచి దానిని భూమిపై ల్యాండ్ చేసే క్రమంలో మొదటి రెండు ఇంజిన్లను మళ్లీ స్టార్ట్ చేశారు. కానీ ల్యాండింగ్ సమయంలో వేగాన్ని నియంత్రించడంలో విఫలం కావడంతో క్రాష్ ల్యాండింగ్ అయింది.రాకెట్ పేలిపోయినట్టు వెల్లడించిన స్పేస్‌ఎక్స్.. ఆ దృశ్యాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రసారం చేసింది. కానీ, అద్భుతమైన పరీక్ష.. స్టార్‌షిప్‌ టీమ్‌కు ధన్యవాదాలు' అంటూ ఆ సంస్థ మెసేజ్‌ చేసింది. ల్యాండింగ్‌ స్పీడ్‌ను పెంచడం వల్లే ఈ పేలుడు సంభంవించినట్లు సమాచారం. స్టార్‌ షిప్‌ కూలిపోయినప్పటికి మాకు అవసరమైన మొత్తం డాటా లభించింది! అభినందనలు స్పేస్‌ఎక్స్ బృందం" అని ఎలాన్‌ మస్క్‌ ట్వీట్ చేశారు


Next Story