ఈ రాకెట్ ను వాడచ్చు.. మళ్ళీ.. మళ్ళీ
SpaceX launches recycled rocket.ఒక్కోసారి మనం చాలా ఖరీదైన వస్తువులు కొంటాం.. కానీ వాటిని మళ్ళీ వాడటం కుదరకపోతే
By తోట వంశీ కుమార్ Published on 24 April 2021 12:11 PM ISTఒక్కోసారి మనం చాలా ఖరీదైన వస్తువులు కొంటాం.. కానీ వాటిని మళ్ళీ వాడటం కుదరకపోతే చాలా ఫీల్ అవుతాం.. మరి రాకెట్లు విషయంలో కూడా అదే కదా సమస్య.. వాటిని మనం మళ్ళీ యూజ్ చెయ్యాలేమేమో అన్న బాధ ఉండేది శాస్త్రవేత్త లకి.. ఇప్పుడు ఆ బాధ లేదు.. అమెరికాకు చెందిన అంతరిక్ష సేవల ప్రైవేటు సంస్థ స్పేస్ఎక్స్ ఒక అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మళ్లీమళ్లీ ఉపయోగించగలిగే సామర్థ్యం ఉన్న రాకెట్, క్యాప్సూల్ ద్వారా నిన్న నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది.
అంతరిక్షానికి వెళ్లిన వారిలో అమెరికా, జపాన్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వ్యోమగాములు ఉన్నారు. వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో ఆరు నెలలపాటు ఉండనున్నారు. కాగా, ఈ ప్రయోగం కోసం పునర్వినియోగ క్యాప్సూల్, రాకెట్‌ను స్సేస్ఎక్స్ ఉపయోగించడం ఇదే తొలిసారి.
A look inside the SpaceX Crew Dragon Endeavour spacecraft during commmunications checks. L-R: @Thom_Astro, @Astro_Megan, @Astro_Kimbrough, & @Aki_Hoshide: pic.twitter.com/q06UZR5DmX
— NASA (@NASA) April 23, 2021
ఆస్ట్రోనాట్లను అంతరిక్షానికి పంపాలంటే ఇప్పటిదాకా ఒక రాకెట్ ను ఒక్కసారి మాత్రమే వాడేందుకు అవకాశం ఉండేది. ఇకపై ఒకసారి వాడిన రాకెట్ ను రెండోసారి కూడా వాడుకోవచ్చు. ఈ దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ 'స్పేస్ ఎక్స్' లు కీలక విజయం సాధించాయి. తొలిసారిగా రీయూజ్డ్ రాకెట్ తో నలుగురు ఆస్ట్రోనాట్లను నింగికి పంపి చరిత్ర సృష్టించ్చాయి. అమెరికా ఫ్లోరిడా స్టేట్ లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా జరిగింది. స్పేస్ లోకి చేరగానే ఆస్ట్రోనాట్లు ఉన్న డ్రాగన్ క్యాప్సూల్ రాకెట్ నుంచి విడిపోయి ఐఎస్ఎస్ దిశగా ప్రయాణం ప్రారంభించింది. ప్రస్తుతం డ్రాగన్ క్యాప్సూల్ భూమి చుట్టూ తిరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ మిషన్ లో నాసాకు చెందిన షేన్ కింబ్రో, మేగన్ మెక్ ఆర్థర్, జపాన్కు చెందిన హోషిడే, ఫ్రాన్స్ కు చెందిన పీస్కెట్ ఉన్నారు.
ఈ ప్రయోగంలో ఉపయోగించిన ఫాల్కన్ 9 రాకెట్ ను, క్రూ (డ్రాగన్) మాడ్యూల్ ను ఇంతకుముందే స్పేస్ఎక్స్ క్రూ1 మిషన్ లో వాడారు. గతేడాది మేలో జరిగిన ఆ మిషన్ లో మాడ్యూల్ ను నింగికి చేర్చి కిందికి వచ్చిన రాకెట్ సేఫ్గా ల్యాండ్ అయింది. ఆస్ట్రోనాట్లను ఐఎస్ఎస్ (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)కు చేర్చిన మాడ్యూల్, ఇతర ఆస్ట్రోనాట్లతో తిరిగి భూమికి వచ్చింది. ఆ రాకెట్ ను, మాడ్యూల్ ను మళ్లీ సిద్ధం చేసి, తాజాగా మరోసారి నలుగురు ఆస్ట్రోనాట్లను నింగికి పంపారు. ఇందులోనూ మాడ్యూల్ ను నింగికి చేర్చిన రాకెట్ లోని ఫస్ట్ స్టేజ్ మళ్లీ కిందికి వచ్చి సేఫ్ గా ల్యాండ్ అయింది. దీనిని మరో మిషన్ లో మళ్లీ వాడుకునేందుకు అవకాశం ఉంది. ఇలా రాకెట్ ను, మాడ్యూల్ ను మళ్లీ వాడుకోవడంతో ఖర్చు, సమయం, శ్రమ ఆదా కానున్నాయి.