పాము విషంతో కరోనాకు మందు..?
Snake venom may be tool to fight COVID-19.కరోనా మహమ్మారి వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది
By తోట వంశీ కుమార్ Published on 1 Sep 2021 6:26 AM GMTకరోనా మహమ్మారి వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈమహమ్మారిని అడ్డుకునేందుకు పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. అన్ని రకాల వేరియంట్లకు ఒకే వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బ్రెజిల్ శాస్త్రవేత్తలు పాము విషంతో కరోనాకు మందు కనిపెట్టారు.
బ్రెజిల్‌లో కనిపించే వైపర్(జరారా కుస్సు) అనే రక్తపింజిరి విషం కరోనా చికిత్సలో ఉపయోగపడే అవకాశం ఉందని సావోపాలో విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. ఈ పాము విషంలోని ఓ పదార్థం(పెప్టైడ్).. కరోనా వైరస్ పునరుత్పత్తిని కోతిలో సమర్థవంతంగా అడ్డుకున్నట్లు గుర్తించారు. దాదాపు 75 శాతం వైరస్ పునరుత్పత్తి అడ్డుకున్నట్లు తెలిపారు. ఇతర కణాలకు ఈ పెప్టైడ్ ఎలాంటి హాని చేయడం లేదని తెలిపారు. ఈ పెప్టైడ్ కోసం పాములను హింసించాల్సిన అవసరం లేదని.. దీని ప్రయోగశాలల్లోనూ ఉత్పత్తి చేయవచ్చునని చెప్పారు.
దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. జంతువులపై చేసే అన్ని ప్రయోగాలు సక్సెస్ అయితే.. తరువాత మానవులపై పరిశోధనలు జరపనున్నారు. బ్రెజిల్‌లో కనిపించే అతిపెద్ద సర్పంగా జరారాకుసోకు గుర్తింపు ఉన్నది. ఆ పాములు సుమారు రెండు మీటర్ల పొడుగు ఉంటాయి. అట్లాంటిక్ తీర ప్రాంత అడవులతో పాటు బొలివియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లో ఈ సర్పాలు సంచరిస్తుంటాయి.