రోద‌సిలోకి నేడు తెలుగ‌మ్మాయి.. అరుదైన ఘ‌న‌త సాధించ‌నున్న శిరీష‌

Sirisha Bandla To Fly On Virgin Galactic Spacecraft Today.చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. అంత‌రిక్షంలోకి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2021 5:14 AM GMT
రోద‌సిలోకి నేడు తెలుగ‌మ్మాయి.. అరుదైన ఘ‌న‌త సాధించ‌నున్న శిరీష‌

చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. అంత‌రిక్షంలోకి మ‌న తెలుగు అమ్మాయి తొలిసారి వెలుతోంది.ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసీలోకి వెళ్తున్న నాలుగో భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా నేడే రోదసీలోకి వెళ్లనున్నారు.

వీఎస్ఎస్ యూనిటీ-22 అనే ప్ర‌త్యేక విమానం భూమి నుంచి 15000 మీట‌ర్ల ఎత్తుకు తీసుకెలుతుంది. అక్క‌డి నుంచి రాకెట్ ప్ర‌జ్వ‌ల‌నంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెలుతుంది. చివ‌రి ద‌శ‌లో సొంత ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో ఐదుగురు వెళ్తుండగా అందులో 34 ఏళ్ల శిరీష కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా యూనివర్సిటీ రూపొందించిన ప్రయోగాన్ని శిరీష నిర్వహిస్తారు. శిరీష ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

తనకు ఈ అవకాశం దక్కినట్లు తెలియగానే మాటలు రాలేదంటూ వర్జిన్‌ గెలాక్టిక్‌ ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్టు చేశారు. అమెరికాలోని ప్యూర్‌డ్యూ యూనివర్సిటీలో ఆమె విద్యాభ్యాసం చేసిన శిరీష్ రోదసియానం సందర్భంగా తాను చదివిన యూనివర్సిటీని గుర్తు చేసుకున్నారు.

Next Story