జనగణమన పాడిన యూఎస్ సింగర్‌.. ప్రధాని మోదీకి పాదాభివందనం

జనగణమన పాడి ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన అమెరికా ప్రముఖ సింగర్ మిల్బెన్

By Srikanth Gundamalla  Published on  24 Jun 2023 2:50 PM IST
Singer Millben, Modi Foot Touch, Viral video

 జనగణమన పాడిన యూఎస్ సింగర్‌.. ప్రధాని మోదీకి పాదాభివందనం

మన దేశంలో భిన్నసంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. మన సాంప్రదాయాలను ఇతర దేశాల్లో ఉన్నవారు ఎంతో గౌరవిస్తారు. కొందరైతే పాటిస్తారు కూడా. ప్రముఖ అమెరికన్‌ సింగర్‌ మేరీ బిల్బెన్‌ కూడా అదే బాటలో నడిచారు. ఆమె ఎంత ప్రముఖురాలో అందరికీ తెలిసిందే. ఆమె ఎన్నో పాటలను పాడారు. ఆమె నటి కూడా. అయితే.. ఇప్పుడు భారతీయ జాతీయ గీతాన్ని ఆలపించారు. తద్వారా ఎంతో మంది భారతీయుల మనసు దోచుకున్నారు. అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన ముగింపు కార్యక్రమం సందర్భంగా.. మేరీ మిల్బెన్‌ మన జాతీయ గీతం జనగణమన ఆలపించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ పాదాలను తాకి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

యునైటెడ్‌ స్టేట్స్‌ ఇండియన్‌ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోనాల్డ్‌ రీగన్‌ భవనంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంట్లోనే సింగర్ మిల్బెన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్‌ నటి, సింగర్‌గా ఆమెకు పేరుంది. గతంలోనూ జనగణమన, ఓం జై జగదీశ్‌ హరే పాడి ఇండియన్స్‌కు దగ్గరయ్యారు. ప్రధాని తన టూర్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు.. భారత ప్రధాని కోసం జాతీయ గీతాన్ని ఆలపించడం ఎంతో గౌరవంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆ దేశ ప్రజలు తమ కుటుంబంగా తనని పిలవడం ఆనందంగా ఉందని అన్నారు. అమెరికన్, భారత జాతీయ గీతాలు రెండూ కూడా ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు ఆదర్శమని ఈ సందర్భంగా చెప్పారు సింగర్ మెల్బెన్.

Next Story