లెబ‌నాన్‌లో భారీ పేలుడు.. ప‌లువురు దుర్మ‌ర‌ణం

Several killed many injured in explosion at South Lebanon Palestinian camp.ద‌క్షిణ లెబ‌నాన్‌ టైర్ న‌గ‌రంలోని ఓ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Dec 2021 12:31 PM IST
లెబ‌నాన్‌లో భారీ పేలుడు.. ప‌లువురు దుర్మ‌ర‌ణం

ద‌క్షిణ లెబ‌నాన్‌ టైర్ న‌గ‌రంలోని ఓ పాల‌స్తీనా రెప్యూజీ క్యాంపులో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడులో అనేక మంది మ‌ర‌ణించార‌ని అక్క‌డి మీడియా తెలిపింది. క‌నీసం 12 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని రాయిట‌ర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. లెబ‌నాన్‌లో ప‌లు పాల‌స్తీనా శిబిరాలు ఉన్నాయి. వాటిలో బుర్జ్ అల్ షెమాలీ క్యాంప్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ శిబిరం హ‌మాస్ గ్రూప్ ఆధ్వ‌ర్యంలో ఉంది. క్యాంపులోని హ‌మాస్ ఆయుధాల నిలువ గ‌దిలో ఈ పేలుడు జ‌రిగింద‌ని.. ఇప్ప‌టి దాకా పేలుడు గ‌ల కార‌ణాలు స్ప‌ష్టంగా తెలియ‌లేద‌ని ప్ర‌భుత్వ జాతీయ వార్తా సంస్థ‌(ఎన్ఎన్ఏ) తెలిపింది. ఈ పేలుడుపై భ‌ద్ర‌తా ద‌ళాలు.. ప్రాథ‌మిక విచార‌ణ చేసి ద‌ర్యాప్తు ప్రారంభించాల‌ని న్యాయ‌మూర్తి భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ఆదేశించిన‌ట్లు చెప్పింది.

అయితే షెహ‌బ్ న్యూస్ ఏజెన్సీ క‌థ‌నం ప్ర‌కారం.. క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడేందుకు నిల్వ ఉంచిన ఆక్సిజ‌న్ డ‌బ్బాల‌ను మండించ‌డం వ‌ల్ల పేలుడు సంభ‌వించింద‌ని తెలిపింది. పేలుడు జ‌రిగిన వెంట‌నే ఆ ప్రాంతాన్ని సైనం త‌మ ఆధీనంలోకి తీసుకుంద‌ని.. ప్ర‌జ‌లు శిబిరాల్లోకి ప్ర‌వేశించ‌కుండా, బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా నిరోధించార‌ని పేర్కొంది. కాగా.. లెబ‌నాల్‌లో దాదాపు ప‌దివేల మంది పాల‌స్తానా శ‌ర‌ణార్థులు ఉన్నారు. వీరు 12 శ‌ర‌ణార్థి శిబిరాల్లో నివ‌సిస్తున్నారు.

Next Story