స్టోన్‌హెంజ్: ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే.!
Secrets About Stonehenge You Didn't Know. ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి.. ఎంత పెద్దదైనా, ఎంత బరువున్న వస్తువులనైనా ఒక చోటు నుంచి మరో
By అంజి Published on 13 Aug 2022 11:16 AM ISTప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి.. ఎంత పెద్దదైనా, ఎంత బరువున్న వస్తువులనైనా ఒక చోటు నుంచి మరో చోటుకి ఈజీగా ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఇలాంటి ఫీట్లు ఇప్పుడు మామూలే కానీ.. 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ఫీట్లు చేశారంటే నమ్ముతారా?. స్టోన్‌హెంజ్ రాతి నిర్మాణాన్ని చూస్తే ఈ సందేహం కలగకమానదు. ఎందుకంటే సివిలైజేషన్, సైన్స్ అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో స్టోన్‌హెంజ్ రాతి నిర్మాణం ఎలా చేయగలిగారు. రాళ్లను ఒకదానిపై ఒకటి ఏ విధంగా పేర్చారు, వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.
ఇంగ్లాండ్‌లోని శాలిస్‌బరీ మైదానంలో ఉన్న ఈ స్టోన్‌హెంజ్‌ను బృహత్ శిలాయుగానికి చెందిన సమాధి స్థలాలని కూడా అంటారు. రేర్ బ్లూ స్టోన్ మెటీరియల్‌తో దీన్ని నిర్మించారు. అతిపెద్ద మెగాలితిక్ రాళ్ల వృత్తాకార సమూహమే ఈ స్టోన్‌హెంజ్. దక్షిణ ఇంగ్లాండ్‌లో ఇలాంటి రాళ్లు చాలా ఉన్నాయి. అయితే ఈ రాళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది అంతుచిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. ఈ అద్భుతమైన కట్టడాల్ని చూడటానికి ప్రతి సంవత్సరం ప్రపంచదేశాల నుంచి ఎంతో మంది టూరిస్ట్‌లు వస్తూ ఉంటారు.
1958లో స్టోన్‌హెంజ్ నుంచి ఓ భారీ రాయిని మిగతా రాళ్ల నుంచీ డ్రిల్లింగ్ చేసి తొలగించారు. రాతి యుగానికి చెందిన ఆ రాయిని ఇన్ని సంవత్సరాలు ఓ స్మారక చిహ్నంగా ఉపయోగించారు. ఓ నాలుగేళ్ల కిందట తిరిగి ఆ రాయిని మిగతా రాళ్ల మధ్యకు చేర్చారు. స్టోన్‌హెంజ్ మిస్టరీని తేల్చేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న చిన్న సైజు రాళ్లను స్టోన్‌హెంజ్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలోగల వేల్స్‌లోని గనుల నుంచి తెచ్చారని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ రాళ్లకు సంబంధించి వచ్చిన కథనాలకూ కచ్చితమైన ఆధారాలు లేవు.