ఆ నాలుగు దేశాల మహిళలను పెళ్లి చేసుకోవద్దని ప్రభుత్వం ఆదేశాలు
Saudi Arabia prohibits men from marrying women from pakistan 3 other nations.సౌదీ అరేబియా ప్రభుత్వం నాలుగు దేశాలకు
By తోట వంశీ కుమార్ Published on 20 March 2021 1:33 PM ISTసౌదీ అరేబియా ప్రభుత్వం నాలుగు దేశాలకు చెందిన మహిళలను పెళ్లి చేసుకోవద్దని చెబుతూ ఆ దేశానికి చెందిన మగవారికి ఆదేశాలను జారీ చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్‌కి చెందిన మహిళల్ని పెళ్లి చేసుకోవద్దని సౌదీ పాలకులు ఆదేశాలు జారీ చేసినట్లుగా పాకిస్థాన్‌కి చెందిన డాన్ రిపోర్ట్ చేసింది. ఈ నాలుగు దేశాలకు చెందిన 5 లక్షల మంది మహిళలు ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నారు. ఇన్నాల్లూ సౌదీ అరేబియా ప్రజలు ఈ నాలుగు దేశాల ప్రజలను పెళ్లి చేసుకోవడానికి అటువంటి ఆంక్షలు ఉండేవి కావు. ఇప్పుడు మాత్రం సౌదీ పాలకులు పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్‌కి చెందిన మహిళల్ని పెళ్లి చేసుకోవద్దని చెబుతూ ఉన్నారు. సౌదీ అరేబియా ప్రజల్లో విదేశీ మహిళల్ని పెళ్లి చేసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని పాలకులు భావించినట్లు తెలిసింది.
ఇక తప్పనిసరిగా విదేశీ మహిళను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని అదనపు రూల్స్ పాటించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ప్రభుత్వానికి మ్యారేజ్ అప్లికేషన్ పెట్టుకోవాలి. దాన్ని పరిశీలించి ప్రభుత్వం ఆమోదించాలో లేదో నిర్ణయిస్తుంది. ఎవరైనా విడాకులు తీసుకొని... మళ్లీ పెళ్లికి చేసుకోవాలంటే వారు 6 నెలల దాకా ఎదురుచూడాలి. ఇక రెండో పెళ్లి ఈ దేశాలకు చెందిన మహిళలను చేసుకోవాలంటే భార్యలో అంగ వైకల్యమైనా ఉండాలి, బిడ్డలు పుట్టే అవకాశం లేకుండా ఉంటే, ఏవైనా తీవ్రమైన రోగంతో బాధపడుతూ ఉంటేనే అధికారులు అనుమతి ఇవ్వాలి. అప్లికేషన్ పెట్టుకోబోయే వారి వయసు 25 సంవత్సరాలు పైనే ఉండాలి.. లోకల్ డిస్ట్రిక్ట్ మేయర్ దగ్గర నుండి పలు సర్టిఫికెట్లను పొందాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త ఆదేశాలు ఎందుకు సౌదీ ప్రభుత్వం అమలు చేస్తోందో అన్నది కూడా అక్కడి వాళ్లకు అర్థం కావడం లేదట..!