ఉక్రెయిన్‌లో ఎన్ని కోట్ల ఆస్తులు ధ్వంసం అయ్యాయంటే
Russian invasion has destroyed $100 billion in assets so far. రష్యా దండయాత్ర కారణంగా ఉక్రెయిన్ లో భారీగా ఆస్తులు ధ్వంసం అయ్యాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లోని రోడ్లు, వంతెనలు,
By M.S.R Published on 11 March 2022 10:30 AM ISTరష్యా దండయాత్ర కారణంగా ఉక్రెయిన్ లో భారీగా ఆస్తులు ధ్వంసం అయ్యాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లోని రోడ్లు, వంతెనలు, వ్యాపారా సముదాయాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటివరకు సుమారు 100 బిలియన్ డాలర్ల ఆస్తుల నష్టం చోటు చేసుకుందని అంచనా వేస్తున్నారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ తగిలిందని ఆ దేశ ప్రభుత్వ అధికారి గురువారం తెలిపారు. "ప్రస్తుతం మా వ్యాపారాలలో 50 శాతం పనిచేయడం లేదు.. మిగిలినవి ఇంకా పనిచేస్తున్నవి 100 శాతం పనిచేయడం లేదు" అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ముఖ్య ఆర్థిక సలహాదారు ఒలేగ్ ఉస్టెంకో అన్నారు. యుద్ధం ఆగిపోయినా ఆర్థిక వృద్ధి పరంగా పరిస్థితి చాలా నిరుత్సాహకరంగా ఉంటుంది అని పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్‌కు వర్చువల్ ప్రసంగంలో ఆయన అన్నారు.
రష్యా చమురు, సహజవాయువును బహిష్కరించడం ద్వారా రష్యాను యూరోపియన్ దేశాలు ఆర్థికంగా దెబ్బతీయాలని పిలుపును ఇచ్చారు. "మా అమాయక ప్రజలను చంపుతున్న దేశానికి యూరోపియన్లు ఇప్పటికీ ఆదాయాన్ని చెల్లిస్తున్నారు" అని వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు దిగుమతులను నిలిపివేసినందుకు అమెరికాను ప్రశంసించారు. ఉక్రెయిన్ కోసం "రికవరీ ఫండ్"ను రూపొందించడంలో వాషింగ్టన్ కూడా సహాయపడుతుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు.
ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవాలన్న అంశంపై ఒత్తిడి చేయబోమని జెలెన్ స్కీ తెలిపారు. ఉక్రెయిన్ గనుక నాటోలో చేరితే, పక్కలో బల్లెంలా మారుతుందని, నాటో దేశాలన్నీ ఉక్రెయిన్ భూభాగం నుంచి తనపై దాడికి దిగే అవకాశాలు ఉంటాయని రష్యా భావిస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందిస్తూ, ఉక్రెయిన్ తో వివాదం అణుయుద్ధానికి దారితీయబోదని అన్నారు. అణుయుద్ధం జరుగుతుందని తాను భావించడం లేదన్నారు. అమెరికా, యూరప్ దేశాల గురించి వ్యాఖ్యానిస్తూ, రష్యా మరోసారి అమెరికా, యూరప్ దేశాలపై ఆధారపడబోదని స్పష్టం చేశారు.