ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం: 12 రోజుల్లో 1,582 మంది పౌరులు మృతి..

RUSSIA-UKRAINE WAR.. 1,582 civilians dead in 12 days. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు ఆగడం లేదు. దేశంలో మానవతావాద పరిస్థితి త్వరగా క్షీణిస్తోంది. మారియుపోల్‌లో విపత్తుగా మారింది.

By అంజి  Published on  13 March 2022 9:06 AM GMT
ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం: 12 రోజుల్లో 1,582 మంది పౌరులు మృతి..

ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు ఆగడం లేదు. దేశంలో మానవతావాద పరిస్థితి త్వరగా క్షీణిస్తోంది. మారియుపోల్‌లో విపత్తుగా మారింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా దాడుల్లో 1,500 మందికి పైగా మరణించారు. ఇందుకు సంబంధించిన భయంకరమైన చిత్రాలు సామూహిక సమాధులలో పాతిపెట్టబడిన పౌరుల మృతదేహాలను చూపుతున్నాయి. "నేను కోరుకునేది ఒక్కటే.. ఇదంతా ముగియాలని. ఎవరు దోషి, ఎవరు సరైన వారో నాకు తెలియదు. ఎవరు ప్రారంభించారో నాకు తెలియదు, కానీ యుద్ధం అంతం కావాలి" అని సామాజిక సేవా కార్యకర్త వోలోడిమిర్ బైకోవ్స్కీ అన్నారు. మృతదేహాలను పాతిపెట్టడంలో స్థానిక అధికారులకు సహాయం చేస్తున్నారు సామాజిక సేవా కార్యకర్త వోలోడిమిర్.

రష్యా బలగాలతో "ముట్టడి చేయబడిన మారియుపోల్ నగరం ఇప్పుడు ఈ గ్రహం మీద అత్యంత ఘోరమైన మానవతా విపత్తు కలిగి ఉంది. 12 రోజుల్లో 1582 మంది పౌరులు మరణించారు. ఇలాంటి సామూహిక సమాధులలో కూడా పాతిపెట్టబడ్డారు. ఉక్రేనియన్ సైన్యాన్ని ఓడించలేక, పుతిన్ నిరాయుధులపై బాంబులు వేసి మానవతా సహాయాన్ని అడ్డుకున్నాడు. యుద్ధాన్ని ఆపడానికి మాకు విమానాలు కావాలి. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోంది'' అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్వీట్ చేశారు.

మరియూపోల్‌లో విద్యుత్‌, నీటి సరఫరా నిలిచిపోయింది. రష్యన్ దాడులతో భవనాలు, ఇళ్లు, ఆసుపత్రులు, వీధులు ధ్వంసమయ్యాయి. యుద్ధం మధ్య, ఉక్రేనియన్లు ఒకరికొకరు సహాయం చేసుకోవడం, సంక్షోభ సమయంలో తమ దేశాన్ని రక్షించుకోవడం కొనసాగించారు. "యుద్ధం పాల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేస్తోంది. మాకు విత్తనాలు, ఇంధనం, ఎరువులు అవసరం, రోడ్లు మూసివేయబడ్డాయి. మాకు నమ్మదగిన వనరులు కావాలి." అని ఉక్రేనియన్ రైతు పెట్రో అన్నారు.

"దురదృష్టవశాత్తూ, ఉక్రెయిన్‌లో మానవతావాద పరిస్థితి వేగంగా క్షీణిస్తూనే ఉంది మరియు కొన్ని నగరాల్లో ఇది విపత్తు స్థాయికి చేరుకుంది" అని రష్యన్ నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ అధిపతి మిఖాయిల్ మిజింట్సేవ్ అన్నారు. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసి దేశవ్యాప్తంగా దాడులకు దిగింది. యుద్ధం భారీ శరణార్థుల సంక్షోభాన్ని ప్రేరేపించింది. అనేక వందల మంది పౌరుల మరణానికి దారితీసింది. ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు 12,000 మందికి పైగా రష్యా సైనికులు మరణించారని పేర్కొంది.

Next Story