మృతిచెందిన సైనికుల ఆర్గాన్స్ అమ్ముతోన్న రష్యా.. సంచలన ఆరోపణలు
ఉక్రెయిన్-రష్యా యుద్ధం రెండేళ్లకు పైబడినా కొనసాగుతూనే ఉంది.
By Srikanth Gundamalla Published on 26 July 2024 8:45 AM ISTమృతిచెందిన సైనికుల ఆర్గాన్స్ అమ్ముతోన్న రష్యా.. సంచలన ఆరోపణలు
ఉక్రెయిన్-రష్యా యుద్ధం రెండేళ్లకు పైబడినా కొనసాగుతూనే ఉంది. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. అగ్రదేశాలు అన్నీ చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించినా రెండు దేశాలుముందుకు రావడం లేదు. ఒకవేళ చర్చలకు ఆహ్వానించినా కండీషన్స్ పెడుతూ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా రష్యాపై ఉక్రెయిన్‌కు చెందిన ఓ సైనికుడి (యుద్ద ఖైదీ) భార్య సంచలన ఆరోపణలు చేసింది. యుద్దంలో చనిపోయిన సైనికుల అవకయవాలను రష్యా దొంగిలిస్తోందనీ.. ఆ తర్వాత వాటిని అమ్ముతోందని తీవ్ర ఆరోపణలు చేసింది.
రష్యా ఆర్మీ చేతిలో చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు స్వదేశానికి తిరిగి వచ్చాక కీలక అవయవాలు కనిపించలేదని ఫ్రీడమ్ టు డిఫెండర్స్ ఆఫ్ మారియు పోల్ గ్రూప్ అధిపతి లారీసా సలేవా పేర్కొన్నారు. రష్యా దురాగతాలకు ఇది పరాకాష్ట ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రష్యా ఈ ఆరోపణలను ఖండించింది. తమ బలగాలపై ఉక్రెయిన్ అనవసర ఆరోపణలు చేస్తోందని చెబుతున్నారు. మరోవైపు రష్యా అదుపులో మరో 10వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. టర్కీలోని అంకారాలో యుద్ధ ఖైదీల కుటుంబాల ప్రతినిధులు, టర్కీలోని ఉక్రేనియన్ రాయబారి వాసిల్ బోడ్నార్‌తో జరిగిన సమావేశంలో సలేవా ఈ ఆరోపణలు చేశారు.