రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి అంతర్జాతీయ మీడియాలో ఎప్పుడూ ఎదో వార్త నానుతూనే ఉంటుంది. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో పుతిన్.. మెట్లపై నుంచి జారిపడినట్లు ప్రముఖ న్యూస్ పోర్టల్ న్యూయార్క్ పోస్టు తన కథనంలో పేర్కొంది. మెట్లు దిగుతుండగా పుతిన్ కాలు జారీ కిందపడ్డాడని, ఐదు మెట్లకు కింద పడిపోవడంతో 70 ఏళ్ల వయస్సు గల పుతిన్ తుంటి ఎముక విరిగిపోయినట్లు పేర్కొంది. దీంతో పుతిన్ తన ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన చేస్తున్నారని, ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగా ఉందని తన కథనంలో రాసుకొచ్చింది. అయితే దీనిపై క్రెమ్లిన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ఇప్పటికే పుతిన్ చేతులు పర్పుల్ రంగులోకి మారిపోయాయని, గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారని ఇలా రష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. గత నెలలో తన క్యూబా కౌంటర్ మిగ్యుల్ డియాజ్-కానెల్‌తో జరిగిన సమావేశంలో, పుతిన్ చేతులు వణుకుతున్నట్లు, ఊదా రంగులోకి మారినట్లు యూకే ఆధారిత ఎక్స్‌ప్రెస్ చెప్పింది. రష్యా నాయకుడు పుతిన్ తన కాళ్లను అసౌకర్యంగా కదుపుతున్నట్లు కనిపించిందని తెలిపింది. పుతిన్ ఆరోగ్యం క్షీణించడంపై పెరుగుతున్న ఊహాగానాలకు ఈ సంఘటనలు మరో అదనంగా మారాయి. రష్యా నాయకుడితో సన్నిహిత సంబంధాలు ఉన్న ఒలిగార్చ్ "పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో చాలా అనారోగ్యంతో ఉన్నాడు" అని పేర్కొన్నారు.