అత్యంత ప్రమాదకర భారీ గ్రహశకలం.. రెప్పపాటు వేగంతో భూమివైపు.. ఏం జరగనుంది..!

Potentially Hazardous Asteroid' Will Be Closely Flying by Earth Later This Month.భూమి వైపు ఓ భారీ గ్రహశకలం

By అంజి  Published on  8 Sep 2021 8:30 AM GMT
అత్యంత ప్రమాదకర భారీ గ్రహశకలం.. రెప్పపాటు వేగంతో భూమివైపు.. ఏం జరగనుంది..!

భూమి వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. స్కూలు బస్సు పరిమాణంలో ఉండే గ్రహశకలం దూసుకొస్తున్నట్లు నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ తెలిపింది. 2021 ఎన్‌వై 1 అనే పేరు గల ఈ గ్రహ శకలం సెప్టెంబర్ 22న భూమి అత్యంత సమీపంగా ప్రయాణించనున్నది. ఈ గ్రహశకలం భూమి నుంచి 1,498,113 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించనున్నట్లు అంచనా వేసిన నాసా.. దీనిని అత్యంత ప్రమాదం కలిగించే దానిగా గుర్తించింది. ఈ గ్రహశకలాన్ని జూన్‌ 12, 2021 నాసా శాస్త్రవేత్తలు మానిటరింగ్ చేస్తున్నారు. ఇది అపోలో క్లాస్ ఆస్టరాయిడ్‌గా ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. 2021 ఎన్‌వై 1 పరిమాణం 0.127 కి.మీ నుంచి 0.284 కి.మీ వ్యాసంతో ఉందని నానా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2021 ఎన్‌వై 1 గ్రహశకలం గంటకు 33,660 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుగా ప్రయాణిస్తోంది. ఈ గ్రహశకలం యొక్క వేగంతో పాటు, దిశను నాసా జేపీఎల్ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సూర్యుని చుట్టు తిరిగి రావడానికి ఈ గ్రహశకలానికి 1400 రోజులు పడుతుంది. 2021 ఎన్‌వై 1 గ్రహశకలం మరో శతాబ్దం భూమికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది.

Next Story