అప్పుడే తెల్లారుతోంది. మెల్ల మెల్లగా సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ సమయంలో సుమారు 2500 మంది బీచ్‌లో నగ్నంగా నిలబడి ఉన్నారు. వారంతా నగ్నంగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇది ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ దగ్గర ఇవాళ జరిగింది. చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ నగ్న ఫొటో షూట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టు చేపట్టారు. స్పెన్సర్ టునిక్‌కు పోజులిచ్చేందుకు దాదాపు 2,500 మంది వ్యక్తులు శనివారం తమ దుస్తులు విప్పారు. ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్సర్ బాధితుల సంఖ్య చాలా ఎక్కువ. అయితే అక్కడి ప్రజల్లో చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉంటే బీచ్‌ల్లో నగ్నంగా తిరిగేందుకు ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం కూడా చేసింది.
ప్రపంచంలోని ప్రసిద్ధమైన ప్రాంతాల్లో సామూహిక నగ్న ఫోటో షూట్‌లను ప్రదర్శించడంలో ట్యూనిక్ పేరుగాంచారు. న్యూయార్క్‌కు చెందిన ట్యూనిక్ ఆస్ట్రేలియాలో నాల్గవ అత్యంత సాధారణమైన క్యాన్సర్ రూపమైన మెలనోమా గురించి అవగాహన పెంచే ప్రయత్నంలో నేక్డ్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌పై స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశారు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో 17,756 కొత్త చర్మ క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతాయని, 1,281 మంది ఆస్ట్రేలియన్లు ఈ వ్యాధితో చనిపోతారని ఫెడరల్ ప్రభుత్వం అంచనా వేసింది. 2010లో సిడ్నీలో 5,200 మంది ఆస్ట్రేలియన్లు సిడ్నీ ఒపెరా హౌస్‌లో నగ్నంగా పోజులిచ్చినప్పుడు టునిక్ చివరిసారిగా మాస్ షూట్‌కి దర్శకత్వం వహించాడు.