అమెరికాలోని పశ్చిమ పనామాలో ఘోర ప్రమాదం జరిగింది. వలసదారులతో కొండపై నుంచి వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 39 మంది మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కొలంబియా నుంచి డేరియన్ లైన్‌ను దాటి పనామాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని గౌలాకా శరణార్థుల శిబిరానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పనామా నేషనల్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ డైరెక్టర్ సమీరా గోజైన్ మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్ గ్వాలాకాలోని షెల్టర్ ప్రవేశ ద్వారం దాటినట్లు కనిపించిందన్నారు. డ్రైవర్ బస్సును హైవేపైకి తిరిగి రావడానికి తిరగడానికి ప్రయత్నించినప్పుడు, బస్సు మరొక బస్సును ఢీకొట్టి కొండపై నుండి కిందపడిపోయిందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 66 మంది ఉన్నారు. 39 మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా గత సంవత్సరం ఇదే మార్గం గుండా 2,48,000 వలసదారులు మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు తెలిపారు. వారిలో అత్యధికంగా వెనెజులాకు చెందినవారు ఉన్నారని తెలిపారు.