పాకిస్థాన్‌లో కూలిన హెలికాప్టర్‌, ఏడుగురు దుర్మరణం

పాకిస్థాన్‌లో ఘోరప్రమాదం సంభవించింది. ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది.

By Srikanth Gundamalla  Published on  28 Sep 2024 3:15 PM GMT
పాకిస్థాన్‌లో కూలిన హెలికాప్టర్‌, ఏడుగురు దుర్మరణం

పాకిస్థాన్‌లో ఘోరప్రమాదం సంభవించింది. ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ సంఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్‌ ఫంఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఉత్తర వజీరిస్తాన్‌లో ఈ సంఘటన జరిగింది.

హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయిన కాసేపటికే కుప్పకూలినట్లు అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి. హెలికాప్టర్‌లో ఆయిల్ కంపెనీకి చెందిన ఉద్యోగులను తరలిస్తుండగా కుప్పకూలింది. టేకాఫ్‌ తీసుకున్న తర్వాత ఇంజిన్ ఫెయిల్ అయినట్లు పైలట్ గుర్తించాడు. వెంటనే అప్రమత్తం అయ్యాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు చేశాడు కానీ.. ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. అయితే.. మృతుల్లో ముగ్గురు రష్యా జాతీయులు, ఇద్దరు పైలట్లు, ఒక క్రూ మెంబర్లు ఉన్నట్లు తెలిసిందే. ఇదే సంఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించిన అధికారులు చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. అయితే దీనిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story