ఎన్నికల్లో గెలిచినా.. మోదీకి అందుకే కంగ్రాట్స్ చెప్పలేదు: పాకిస్థాన్
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ సాధించింది. ప్ర
By Srikanth Gundamalla Published on 8 Jun 2024 5:16 PM ISTఎన్నికల్లో గెలిచినా.. మోదీకి అందుకే కంగ్రాట్స్ చెప్పలేదు: పాకిస్థాన్
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటుంది. ఈ క్రమంలో మోదీకి, ఎన్డీఏ కూటమి పార్టీలు, నేతలకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. అమెరికా సహా వివిధ దేశాధినేతలు కూడా మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. కానీ.. ఇప్పటి వరకు దాయాది దేశం పాకిస్థాన్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మోదీ గెలుపు గురించి కానీ.. శుభాకాంక్షలు చెప్పడం గానీ చేయలేదు. అయితే.. తాజాగా ఇదే విషయంపై పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ మాట్లాడారు.
మీడియా సమావేశంలో మాట్లాడిన ముంతాజ్.. భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై మాట్లాడటానికి ఇప్పటికేం లేదన్నారు. అక్కడ ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదని చెప్పారు. అందుకే ఇప్పుడు అభినందనలు చెబితే తొందరపాటు అవుతుందని వ్యాఖ్యానించారు. తమ సొంత నాయకత్వాన్ని నిర్ణయించుకోవడం భారత ప్రజల హక్కు అని చెప్పారామె. భారత్‌తో పాటు పొరుగు దేశాలతో పాకిస్థాన్ సత్సంబంధాలు కోరుకుంటుందని ముంతాజ్ చెప్పారు. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌తో పాటు ఇతర వివాదాలను నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చూస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
2019లో ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాని తర్వాత పాకిస్తాన్, భారత్ మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. భారత్ తీసుకున్న ఆ నిర్ణయం పొరుగు దేశాల మధ్య చర్చలు జరిపే పర్యావరణనాన్ని దెబ్బతీస్తుందని పాక్ ఆరోపించింది. అయితే.. భారత్ మాత్రం పాక్‌తో సత్సంబంధాలనే కోరుతూ వచ్చింది.