దారుణం.. పాఠశాలలో బయటపడ్డ 600 అస్తిపంజరాలు
Over 600 bodies found at Indigenous school in Canada.వందల సంఖ్యలో చిన్నారుల అస్థిపంజరాలు బయటపడటంతో
By తోట వంశీ కుమార్ Published on 25 Jun 2021 7:29 AM GMT
వందల సంఖ్యలో చిన్నారుల అస్థిపంజరాలు బయటపడటంతో కెనడా దేశం మరోసారి ఉలిక్కిపడింది. గత నెలలో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని మూసిఉన్న పాఠశాలలో దాదాపుగా 200లకు పైగా అస్తిపంజరాలు బయటపడగా.. తాజాగా వాంకోవర్‌లోని మూసిఉన్న ఓ పాఠశాలలో 600లకు పైగా అస్తిపంజరాలు బయటపడ్డాయి. దీంతో కెనడా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక రాడార్ వ్వవస్థను ఏర్పాటు చేసి మూసిఉన్న పాఠశాలలో సెర్ఛ్ ఆపరేషన్ చేపట్టారు.
గతనెలలో ప్రఖ్యాత కామ్‌లూన్స్ ఇండియన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 215 అస్తిపంజరాలు బయటపడటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాడార్ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూసిఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లపైన దృష్టిసారించింది. ఈ క్రమంలో కొవెస్సెస్ ఫస్ట్ నేషన్ ప్రాంతంలోని మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో రాడార్ ద్వారా సెర్చ్ చేయగా.. 751 గుర్తు తెలియని సమాధులను గుర్తించారు.
ఇందులో దాదాపు 600మందికి పైనే చిన్నారులను సమాధి చేసినట్లు తెలిసింది. దీంతో తవ్వకాలు చేపట్టి పిల్లల అవశేషాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాల 1899 నుంచి 1997 మధ్య రోమన్ కాథలిక్ చర్చి ఆధ్వర్యంలో నడిచింది.