ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపించడానికి కారణం ఇదే..!
Omicron Survives On Skin For Nearly A Day.కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలై రెండేళ్లు కావొస్తొంది. అయినప్పటికీ కొత్త
By తోట వంశీ కుమార్ Published on 27 Jan 2022 1:40 PM ISTకరోనా మహమ్మారి వ్యాప్తి మొదలై రెండేళ్లు కావొస్తొంది. అయినప్పటికీ కొత్త వేరియంట్ల రూపంలో ఈ మహమ్మారి మానవాళిని వణికిస్తోంది. కరోనా వేరియంట్లలో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ ప్రభావం తక్కువగానే ఉన్నా చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ ఇంత వేగంగా వ్యాప్తి చెందడంపై ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఒమిక్రాన్ వేరియంట్ మానవ శరీరంపై 21 గంటల పాటు సజీవంగా ఉంటుందని జపాన్ కు చెందిన "క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్" పరిశోధన బృందం గుర్తించింది. అదే విధంగా ప్లాస్టిక్‌పై దాదాపు 8 రోజుల పాటు ఈ వేరియంట్ సజీవంగా ఉంటుందని తెలిపారు. ఈ కారణంగానే ఒమిక్రాన్ వేరియంట్ శర వేగంగా వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు. గతంలో బయటపడిన కరోనా వైరస్ వేరియంట్లేవీ ఇంత ఎక్కువ సమయం మనిషి శరీరంపై కానీ, ప్లాస్టిక్ పై కానీ లేవని తేలింది.
శాస్త్రవేత్తల పరిశోధనల మేరకు.. ఓమిక్రాన్ వేరియంట్ కు బ్యాహ వాతావరణాన్ని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. మానవ శరీరంపై 8.6 గంటలు ఉండగా.. ప్లాస్టిక్ ఉపరితలంపై 193.5 గంటలు అంటే దాదాపు 8 రోజుల పాటు జీవించగలదు. సాధారణ కరోనా వైరస్ మానవ శరీరంపై 8.6గంటలు ఉండగా.. ఆల్ఫా వేరియంట్ 19.6 గంటలు, బీటా వేరియంట్ 19.1 గంటలు, గామా వేరియంట్ 11 గంటలు, డెల్టా వేరియంట్ 16.8 గంటలు మరియు ఓమిక్రాన్ వేరియంట్ 21.1 గంటల పాటు ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
అందుకనే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులను తప్పనిసరిగా ధరించాలి. అంతేకాకుండా కరోనా నిబంధనలు తప్పక పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.