ఈశాన్య జపాన్‌లోని అమోరి ఫ్రిఫెక్చర్ హచినొహె పోర్టు సమీపంలో చమురు రవాణా నౌక రెండు ముక్కలైంది. దీంతో పెద్ద ఎత్తున చమురు సముద్రంలో కలిసిపోయింది. బుధవారం ఉదయం పనామాకు చెందిన 39,910 టన్నుల బరువైన క్రిమ్సన్ పోలరిస్(షిప్ పేరు) హచినోహే పోర్టు నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. షిప్ తీరం నుండి 4 కిమీ (2.4 మైళ్ళు) దూసుకెళ్లిందని అయితే..పొలారిస్ నేలను తాకడంతో రెండు ముక్కలైందని అధికారులు తెలిపారు. పడవ ముక్కలు కావడంతో భారీ ఎత్తున చమురు వృధా పోయింది. అయితే షిప్ సముద్రగర్భంలో ముగినిపోకుండా తప్పించుకోగలిగింది.కానీ పగుళ్లు ఏర్పడ్డాయని ఎన్‌వైకె లైన్ తెలిపింది.
పడవ ముక్కలు కావడంతో భారీ ఎత్తున చమురు వృధా పోయింది. గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి ఆ ప్రాంతంలో 24 కిలోమీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పున తెట్టు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అయితే నౌకలోని 21 మంది సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరుగలేదని.. వారు సురక్షితంగానే ఉన్నట్టు చెప్పారు. లీక్ అవుతున్న ఆయిల్ ని అదుపుచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.