జననాల రేటు తగ్గడంపై కన్నీరు పెట్టుకున్న కిమ్‌.. వీడియో

ఉత్తరకొరియాలో గత కొంతకాలంగా భారీగా జననాల రేటు పడిపోతుంది.

By Srikanth Gundamalla  Published on  6 Dec 2023 12:58 PM IST
north korea, president kim, crying, viral video,

జననాల రేటు తగ్గడంపై కన్నీరు పెట్టుకున్న కిమ్‌.. వీడియో 

ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. దేశ ప్రజలు ఇబ్బందులు పడ్డా కూడా అవేవీ పట్టించుకోరు. నియంత అని పేరు తెచ్చుకున్న కిమ్‌.. దేశ ప్రజల ముందే కంటతడి పెట్టుకున్నారు. దేశంలో ఉన్న తల్లులతో మాట్లాడిన ఆయన.. జననాల రేటు పడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఎక్కువమంది పిల్లలను కనాలని తల్లులకు చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం కిమ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరకొరియాలో గత కొంతకాలంగా భారీగా జననాల రేటు పడిపోతుంది. దాంతో.. దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో తల్లుల కోసం ప్రత్యేకంగా కిమ్ ప్రభుత్వం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా జననాల రేటు పడిపోవడంపై ఈ సభలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కీలక నేత ఒకరు మాట్లాడుతుండగా కిమ్‌ జోంగ్ ఉన్న కన్నీరు పెట్టుకున్నారు. టిష్యూ పేపర్‌తో ఆయన కళ్లు తడుచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎప్పుడూ చిన్న చిన్న తప్పులకే మరణ శిక్షలు విధించే వ్యక్తి.. జనాలను బాధపెట్టడం తప్ప బాధపడటం చూడని కిమ్‌ను అలా ఏడుస్తూ చూసే సరికి ఆదేశంలోని ప్రజలు కూడా కన్నీరు పెట్టుకున్నారు. సభలో పాల్గొన్న మహిళలు కూడా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.

ఇందులో పాల్గొన్న అధ్యక్షుడు కిమ్‌ మాట్లాడుతూ.. జననాల రేటు తగ్గుదలను నిరోధించాలని పిలుపునిచ్చాడు. అయితే.. పిల్లలకు సరైన సంరక్షణ అందించే బాధ్యత మనందరి బాధ్యత అన్నారు. ఇందు కోసం తల్లులతో కలిసి ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటోందని కిమ్‌ అన్నారు. దేశంలో ఉన్న తల్లులు అంతా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కిమ్‌ జోంగ్‌ ఉన్ కోరారు. గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. ఇతర దేశాలతో పెద్దగా ఎలాంటి సంబంధాలు కొనసాగించడం లేదు. దాంతో.. వ్యాపార, వాణిజ్య పనులు సాగకపోవడంతో ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఆ దశం. పేదరికంలో ఉత్తరకొరియా మగ్గుతున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Next Story