ఆర్థిక శాస్త్రంలో.. ఆ ముగ్గురికి నోబెల్..!

Nobel panel to announce 2021 economics prize.ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక

By అంజి  Published on  12 Oct 2021 4:14 AM GMT
ఆర్థిక శాస్త్రంలో.. ఆ ముగ్గురికి నోబెల్..!

ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఎకనామిక్స్‌లో కొత్త అంశాలను వెలుగులోకి తీసుకువచ్చినందుకుగాను డేవిడ్ కార్డ్, జాషువా డీ ఆంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్‌లకు నోబెల్ బహుమతి వరించింది. డేవిడ్ కార్డ్‌కు సగం నోబెల్ బహుమతి దక్కగా... మరో ఇద్దరూ సగం నోబెల్ బహుమతిని పంచుకోనున్నారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశాలను వెలుగులోకి తేవడంతో పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు సంభవించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది.

కార్మిక ఆర్థిక వ్యవస్థపై పరిశోధనలు చేసినందుకు గాను బెర్క్‌లేలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ కార్డ్‌కు సగం నోబెల్ బహుమతి వరించింది. ఇక ఆర్థిక శాస్త్రంలో క్యాజువల్ రిలేషన్‌షిప్స్‌ను విశ్లేషించినందుకుగాను స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గైడో ఇంబెన్స్‌, మసాచుసెట్స్ టెక్నాలజీ ఇన్స్‌టిట్యూట్ ప్రొఫెసర్ జాషువాకు మరో సగం నొబెల్ బహుమతి దక్కనుంది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఆర్థిక శాస్త్రంలో చాలా విషయాలను విశ్లేషిస్తూ అనేక సంచలనాత్మక అంశాలను వెల్లడించారు. వలసవాదం వల్ల జీతం, ఉద్యోగంపై ప్రభావం ఉంటుందా.?, ఉన్నతస్థాయి చదువులు చదువుకోవడం వల్ల భవిష్యత్‌లో ఇన్‌కమ్‌ ఎలాంటి ఉంటుంది. కారణం ఏంటి, దాని ప్రభావం ఏంటి అన్న చాలా ప్రశ్నలకు.. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు తమదైన శైలిలో సహజంగా సమాధానాలు ఇవ్వొచ్చని నిరూపించారు.

Next Story