చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. ఈ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమై ఏడాదిన్నర దాటినా.. ఇంకా ఈ మహమ్మారి విలయం కొనసాగుతోంది. చాలా దేశాలు ఇంకా ఈ మహమ్మారి నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. మనదేశంలో కూడా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను రాసుకోవడంతో పాటు మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే.. ఇలాంటి సమయంలో ఓ దేశం మాత్రం ధైర్యంగా నిలబడింది. దేశ ప్రజలు ఎవ్వరూ కూడా మాస్కులు పెట్టుకో అక్కర్లేదు అంటూ ప్రకటించింది.
ఆ దేశం మరే దేశమో కాదు ఇజ్రాయెల్. అయితే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఓ కారణం ఉంది. దేశ జనాభాలో సగానికి పైగా..కరోనా వ్యాక్సినేషన్ అందించారంట. దీంతో అందరూ బహిరంగప్రదేశాల్లో తప్పనిసరిగా..మాస్కులు ధరించాలన్న ఆదేశాలను ప్రభుత్వం రద్దు చేసింది. స్కూల్స్‌ను ప్రారంభించింది. మాస్క్ లు లేకుండా బహిరంగంగా జల్సాలు చేయవచ్చని.. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ప్రజలకు టీకాలు అందించి కరోనా వైరస్ ను ఎదుర్కొవడంలో విజయం సాధించామని చెబుతున్నారు.
ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందుచూపుగా వ్యాక్సినేషన్ పై దృష్టి సారించింది. దేశంలో ఒక్క డోసు టీకా తీసుకున్నవారు 60 శాతం మంది కాగా.. రెండు డోసులు వేయించుకున్న వారు 56 శాతం మంది. ఇక్క డ ఫైజర్, బయోఎన్‌టెక్ టీకాలను అందిస్తున్నారు. 16 ఏళ్ల లోపు వారని మినహాయించారు.