కృష్ణ దాస్ తరపున వాదించడానికి ఎవరూ లేరట!

బాంగ్లాదేశ్ లో హిందూ హక్కుల కోసం పోరాడుతున్న చిన్మోయ్ కృష్ణ దాస్ తరపున వాదిస్తున్న న్యాయవాదిపై దాడి చేయడంతో ఆయన ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నాడు.

By Medi Samrat  Published on  3 Dec 2024 4:17 PM IST
కృష్ణ దాస్ తరపున వాదించడానికి ఎవరూ లేరట!

బాంగ్లాదేశ్ లో హిందూ హక్కుల కోసం పోరాడుతున్న చిన్మోయ్ కృష్ణ దాస్ తరపున వాదిస్తున్న న్యాయవాదిపై దాడి చేయడంతో ఆయన ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఏ లాయర్ కూడా చిన్మోయ్ దాస్ తరపున వాదించడానికి ముందుకు రాకపోవడంతో ఒక నెల రోజుల పాటూ చిన్మోయ్ కృష్ణ దాస్ జైలులో గడపవలసి ఉంటుంది.

చిన్మోయ్ కృష్ణ దాస్ తరపున వాదిస్తున్న న్యాయవాది రామన్ రాయ్‌పై దారుణంగా దాడి చేశారని ఇస్కాన్ ఇండియా తెలిపింది. ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఇస్లాంవాదుల దాడులు ఉగ్రరూపం దాల్చాయని ఇస్కాన్ ఇండియా ఆరోపించింది. రాయ్‌పై దాడి తర్వాత చిన్మోయ్ తరుపున కేసు వాదించేందుకు ఏ లాయర్ ముందుకు రావడం లేదు. దీంతో ఆయన బెయిల్ పొందడం మరింత ఆలస్యం అవ్వనుంది. దాస్ తరుపరి విచారణ జనవరి 2కి వాయిదా పడడంతో మరో నెలరోజుల పాటు ఆయన జైలులోనే ఉండనున్నారు. చిట్టగాంగ్ బార్ అసోసియేషన్‌లోని ముస్లిం లాయర్లు, దాస్ తరుపున వాదించేందుకు హాజరైన హిందూ లాయర్లను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Next Story