ఘోర ప్రమాదం, ట్రక్కును ఢీకొట్టిన ఇంధన ట్యాంకర్..48 మంది దుర్మరణం

ఆదివారం ఉత్తర-మధ్య నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది.

By Srikanth Gundamalla  Published on  9 Sept 2024 9:00 AM IST
ఘోర ప్రమాదం, ట్రక్కును ఢీకొట్టిన ఇంధన ట్యాంకర్..48 మంది దుర్మరణం

గుజరాత్‌లో కొందరు అల్లరిమూకలు రెచ్చిపోయి ప్రవర్తించారు. సూరత్‌లోని ఒక గణేష్‌ మండపంపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్లరిమూకలు గొడవతో ఆపకుండా.. అక్కడున్న వాహనాలకు నిప్పంటించారు. దాంతో.. పరిస్థితులు మరింత చేజారిపోయాయి. ఈ అల్లర్లపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అల్లరిమూకలను అడ్డుకున్నారు.

అల్లరిమూకలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు ముందు భంగపాటే ఏర్పడింది. వారు ఎంత చెప్పినా వినకపోవడంతో లాఠీచార్జ్‌ చేశారు.అప్పటికీ వారు ఆగలేదు. దాంతో బాష్పవాయును ప్రయోగించాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోవడంతో అక్కడికి గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ స్వయంగా వెళ్లారు. గణేష్‌ మండపం దగ్గరకు వచ్చి, పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్, సూరత్ మేయర్ దాఖేష్ మవానీ ఆయన వెంట ఉన్నారు. సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలో ఒక గణేష్ మండపంపై ఆరుగురు వ్యక్తులు రాళ్లు రువ్వారని మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. ఆరుగురితో పాటుగా.. వీరికి సహకరించిన మరో 27 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. కాగా.. ఆదివారం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణంతో స్థానికంగా కలకలం రేగింది. స్థానిక ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదనీ.. నిత్యం పోలీసుల బందోబస్తు ఉంటుందని మంత్రి హర్ష్‌ సంఘ్వి చెప్పారు.

Next Story