ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మృతి
New Zealand woman dies after receiving Pfizer vaccine.కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మొన్నటి
By తోట వంశీ కుమార్ Published on 30 Aug 2021 8:32 AM GMT
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మొన్నటి వరకు కేసులు తగ్గినప్పటికి తాజాగా పలుదేశాల్లో కేసులు పెరుగుతుండడం కలవరపెడుతోంది. ఇక ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. కొన్ని చోట్ల వ్యాక్సిన్లు వికటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మరణించడం ఆందోళన రేపుతోంది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటు చేసుకుంది.
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అత్యంత అరుదైన మయోకార్డిటిస్ (గుండె కండరాల్లో ఇన్‌ఫ్లేమేషన్) వల్ల ఆ మహిళ మరణించినట్లు తాము బావిస్తున్నట్లు చెప్పారు. పైజర్ వ్యాక్సిన్ వల్ల న్యూజిలాండ్‌లో సంభవించిన తొలి మరణం ఇదేనని చెప్పింది. ఆ మహిళ వయస్సు మాత్రం చెప్పలేదు. ఆ మహిళ ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోందని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఫైజర్ వ్యాక్సిన్ వల్ల కలిగే అనర్థాల కంటే ప్రయోజనాలే అధికంగా ఉన్నట్లు తెలిపింది.
ఇక న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు ఫైజర్‌తోపాటు జాన్సెన్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లకు అనుమతి ఇచ్చారు. అయితే.. సాధారణ ప్రజలకు ఇవ్వడానికి మాత్రం ఇప్పటికైతే ఫైజర్‌కు మాత్రమే అనుమతి ఉంది.