షాకింగ్.. టీవీ ఇంటర్వ్యూలో ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రులను ఎలా చంపాడో చెప్పాడు..!

అమెరికాలో ఒక‌ టీవీ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను ఎనిమిదేళ్ల క్రితం చంపి, వారి మృతదేహాలను ఇంటి పెరట్లో ఎలా పాతిపెట్టాడో షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

By -  Medi Samrat
Published on : 27 Sept 2025 3:49 PM IST

షాకింగ్.. టీవీ ఇంటర్వ్యూలో ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రులను ఎలా చంపాడో చెప్పాడు..!

అమెరికాలో ఒక‌ టీవీ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను ఎనిమిదేళ్ల క్రితం చంపి, వారి మృతదేహాలను ఇంటి పెరట్లో ఎలా పాతిపెట్టాడో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. నిందితుడు స్టూడియో నుంచి బయటకు రాగానే పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.

లోరెంజ్ క్రాస్ దిగ్భ్రాంతికరమైన ఒప్పుకోలు గురువారం వెలుగులోకి వచ్చింది. ఒక రోజు ముందు అల్బానీలోని ఒక ఇంటి నుండి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లోరెంజ్ క్రాస్ తల్లిదండ్రులు ఫ్రాంజ్, థెరిసియా క్రాస్ ఏళ్ల తరబడి ఎవరికీ కనిపించడం లేదని, వారి గురించి ఎలాంటి సమాచారం లేదని పోలీసుల విచారణలో తేలింది.

Lorenz Krause స్థానిక మీడియా అవుట్‌లెట్ CBS6కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చాలా బలహీనంగా మారడం వల్లే ఈ హత్యలు చేశానని చెప్పాడు. తన తల్లిదండ్రులను హత్య చేశానని నేరుగా చెప్పడానికి క్రాస్ మొదట ఇష్టపడలేదు.. కానీ యాంకర్ ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేయ‌డంతో అతను హత్యల‌ను అంగీకరించాడు.

"అతడిని చంపమని అతని తల్లిదండ్రులు అడగలేదు, కానీ వారి పరిస్థితి మరింత దిగజారిపోతోందని వారికి తెలుసు" అని క్రాస్ చెప్పాడు. నేను నా తల్లిదండ్రుల పట్ల నా బాధ్యతను నిర్వర్తించాను. వారి బాధ పట్ల నా ఆందోళన చాలా ముఖ్యమైనది. ఆ స‌మ‌యంలో నా తండ్రి వ‌య‌సు 92, నా త‌ల్లి వ‌య‌సు 83"

వీధి దాటుతుండగా ఆమె తల్లి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారని, కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత త‌న‌ తండ్రి ఇకపై డ్రైవింగ్ చేయలేక‌పోయార‌ని క్రాస్ చెప్పాడు. అయితే.. క్రాస్ తన తల్లిదండ్రులకు సంబంధించి ఎటువంటి ప్రాణాంతక అనారోగ్యం ఉన్న‌ట్లు ప్రస్తావించలేదు.

క్రాస్ ఒక అర్థరాత్రి తన ఒట్టి చేతులతో తన తండ్రిని గొంతు పిసికి చంపిన‌ట్లు.. కొన్ని గంటల తర్వాత తన తల్లిని తన భర్త ఛాతీపై ఉంచిన తర్వాత తాడుతో చంపిన‌ట్లు చెప్పాడు. ఆ త‌ర్వాత రెండు మృత‌దేహాల‌ను యార్డ్‌లో పాతిపెట్టిన‌ట్లు పేర్కొన్నాడు.

CBS6 ప్రకారం.. క్రాస్‌పై రెండు హత్యల‌కు సంబంధించి ప‌లు సెక్ష‌న్ల కింద అభియోగాలు మోపబడ్డాయి. అతడు శుక్రవారం అల్బానీ సిటీ క్రిమినల్ కోర్టుకు హాజరు అయ్యాడు. త‌న‌ను తాను నిర్దోషి అని పేర్కొంటూ వాదించాడు. అయితే కోర్టు అత‌డిని రిమాండ్‌కు పంపింది.

Next Story