ఎవరెస్ట్ శిఖరం సోలో క్లైంబింగ్‌కు నేపాల్ బ్రేక్..ఎందుకంటే?
ఎవరెస్ట్ శిఖరాన్ని సింగిల్‌గా అధిరోహించాలనుకునే వారికి నేపాల్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. నేపాల్ తన పర్వతాహోరణ నిబంధనలు సవరిస్తూ గెజిట్ రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 5 Feb 2025 4:05 PM IST
ఎవరెస్ట్ శిఖరం సోలో క్లైంబింగ్‌కు నేపాల్ బ్రేక్..ఎందుకంటే?
ఎవరెస్ట్ శిఖరాన్ని సింగిల్‌గా అధిరోహించాలనుకునే వారికి నేపాల్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. నేపాల్ తన పర్వతాహోరణ నిబంధనలు సవరిస్తూ గెజిట్ రిలీజ్ చేసింది. ఎవరెస్ట్ శిఖరంతో పాటు 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న అన్ని పర్వతాలకు సోలో యాత్రలను అధికారికంగా నిషేధిస్తున్నట్లు గెజిట్ విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం పర్వతాహోరణ బృందంలోని ప్రతి ఇద్దరు సభ్యులతో పాటు కనీసం ఒక ఎత్తు కార్మికుడు, మౌంటెన్ గైడ్ ఉండాలని తన నిబంధనల్లో తెలిపింది. ఈ నియమం ఎవరెస్ట్ శిఖరంతో సహా 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న అన్ని పర్వతాలకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఎనిమిది వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న పర్వత శిఖరాన్ని అధిరోహించేటప్పుడు, పర్వతాహోరణ బృందంలోని ప్రతి ఇద్దరు సభ్యులతో కనీసం మౌంటెన్ గైడ్‌ను వారితో తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. కాగా నిబంధనల అమల్లోకి రావడంతో శిఖరాలపై సోలో క్లైంబింగ్ యుగం అఫీషియల్‌గా ముగిసినట్లయిందని తెలిపింది.
నేపాల్ రిలీజ్ చేసిన గెజిట్ ప్రకారం అధిరోహకుల కుటుంబ సభ్యులు, గైడ్‌లు, ఎత్తయిన ప్రదేశాల బేస్ క్యాంప్ కార్మికులను కూడా బేస్ క్యాంప్ నుంచి నిషేధించారు. పర్యాటక శాఖ ముందస్తు అనుమతి తీసుకుని ఉంటేనే బేస్ క్యాంప్‌లో పర్వతారోహకుల కుటుంబ సభ్యులకు రెండు రోజులకు మించకుండా అక్కడ బస చేసే మినహాయింపు ఇవ్వవచ్చని నూతనంగా జారీ చేసిన గెజిట్‌లో పేర్కొన్నారు. ఇక తమ క్లయింట్‌లు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినట్లు సెల్ఫ్ స్టేట్‌మెంట్ చేసుకునేందుకు హై ఆల్టిట్యూడ్ గైడ్‌లను కూడా కేటాయించారు. విజయవంతమైన శిఖరాన్ని నిరూపించడానికి, యాత్ర నిర్వాహకులు, అధిరోహకుడి ఫేస్‌ను స్పష్టంగా చూపించే అసలు ఫొటోను సమర్పించాలని గెజిట్‌లో పేర్కొన్నారు.